ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా సినిమా టికెట్ల ధరలను తగ్గించడంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అసహనం చెందుతున్న సంగతి తెలిసిందే.ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే.
థియేటర్ పక్కన ఉండే కిరాణాకొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలు కొంతమంది ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఇక ఇదే తరుణంలో నిర్మాతలు మరియు ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ పెద్దలు.
సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం చెందుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇండస్ట్రీలో అందరి పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కింగ్ నాగార్జున సినిమా టికెట్ ధర విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత టికెట్ ధరలతో తనకు ఏమీ ఇబ్బంది లేదని పేర్కొన్నారు.మిగిలినవారి సంగతి నాకు తెలియదు అని కరాఖండిగా చెప్పేశారు.టికెట్ల రేట్లు ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయని పేర్కొన్నారు.“బంగార్రాజు” సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ ప్రముఖ ఛానల్ విలేకరి ప్రశ్నించగా నాగార్జున ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా గతంలో ఇండస్ట్రీ సమస్యల విషయంలో .తోటి హీరోలతో కలిసి సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది.ఆ తర్వాత వ్యక్తిగతంగా నాగార్జున సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భం కూడా ఉంది.అయితే ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధర విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల నాగార్జున తనకు ఎటువంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యలు చేయడం.
అటూ ఇండస్ట్రీ లోను ఇటు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.