సీఎం జగన్ తో ఏం మాట్లాడారని అడిగా.. నాగార్జున!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం బంగార్రాజు.ఇందులో నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే.

 Nagarjuna On Chiranjeevi And Ys Jagan At Bangarraju Blockbuster Meet Nagarjuna,-TeluguStop.com

నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా, నాగచైతన్య సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఇటీవలే జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా థియేటర్లలో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.నాగార్జున కింగ్ అని మరొకసారి నిరూపించుకున్నాడు.

ఎందుకంటే కరోనా మహమ్మారి మరొకసారి ఉధృతంగా పెరిగిపోతున్న సమయంలో ధైర్యం చేసి బంగార్రాజు సినిమాను విడుదల చేశాడు.సంక్రాంతి బరిలో ఏ సినిమా ఎదురు లేకుండా బంగార్రాజు సినిమా దూసుకుపోతోంది.

ఇక ఈ సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా తాజాగా రాజమండ్రి లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు.ఇక సక్సెస్ మీట్ సందర్భంగా ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భేటీ గురించి ప్రస్తావించాడు.ఇక బంగార్రాజు సినిమా ప్రమోషన్ సమయంలో ఇదే విషయం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.

ఇక వారం క్రితమే సీఎంతో అపాయింట్మెంట్ కన్ఫామ్ అయ్యింది అని చిరంజీవి గారు తెలిపారు.

Telugu Ap Ticket Rates, Bangarraju, Chirajeevi, Cm Jagan, Nagarjuna, Theaters, T

కానీ నేను బంగార్రాజు సినిమా పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉండటంతో రాలేను అని తెలిపాను అని చెప్పుకొచ్చాడు నాగార్జున.మరోసారి నాగార్జున జగన్ చిరు భేటీ గురించి మాట్లాడాడు.అనంతరం బంగార్రాజు సినిమా గురించి మాట్లాడుతూ.

రాజమండ్రిలో బంగార్రాజు సినిమా ఇంకా హౌస్ ఫుల్‌లో ఆడుతోందని విన్నాను.అన్ని థియేటర్ లో ఇంకా హౌస్ ఫుల్ ఉందని విన్నాను.

నేను కలెక్షన్ల గురించి మాట్లాడేందుకు రాలేదు.మీ ప్రేమ ముందు కలెక్షన్స్ నథింగ్ అని చెప్పుకొచ్చాడు నాగార్జున.

బంగార్రాజు అచ్చమైన తెలుగు సినిమా.మన పంచెకట్టుతో, మన సంబరాలు, మన సరసాలతో అచ్చమైన తెలుగు సినిమా.

బంగార్రాజు మేం కాదు.మా నాన్న గారు.

ఇక్కడే ఎక్కడో ఆయన ఉండి చూస్తుంటారు అని తెలిపారు నాగార్జున.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube