స్టార్‌ హీరో సినిమా మరీ ఇంత స్పీడ్ గా సాధ్యమేనా?

ఈ మధ్య కాలంలో సినిమా ల మేకింగ్ కు చాలా సమయం పడుతుంది.

చిన్న హీరోల సినిమాలు అయినా కూడా కనీసం ఆరు నెలల సమయం పడుతున్న విషయం తెల్సిందే.

ఇక స్టార్‌ హీరోల సినిమాలకు ఏడాది సమయం ఈజీగా తీసుకుంటున్నారు.రాజమౌళి దర్శకులు ఏకంగా రెండు ముడూ సంవత్సరాలు తీసుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో ఒక స్టార్‌ హీరో సినిమాను నాలుగు నుండి అయిదు నెలల్లో పూర్తి చేయడం మాత్రమే కాకుండా విడుదల చేస్తాం అంటూ ప్రకటిస్తే ఎవరైనా నమ్ముతారా.నమ్మాల్సిందే.

నాగార్జున హీరోగా( Nagarjuna )రూపొందుతున్న నా సామిరంగ సినిమా( Naa Saami Ranga ) మొన్ననే షూటింగ్ ప్రారంభం అయింది.

Advertisement

సంక్రాంతికి ( Sankranti )సినిమా రాబోతుంది.ఇప్పటికే సినిమా విడుదలకు సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చేసింది.అంతే కాకుండా సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు నవంబర్ లోనే ముగించబోతున్నారు.

అంటే మూడు నెలల లోపు లోనే సినిమాను ముగిస్తున్నారు. ఒక స్టార్‌ హీరో సినిమా షూటింగ్ ను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయడం ఎంత వరకు సాధ్యం అంటే.

నాకు సాధ్యమే అన్నట్లుగా నా సామిరంగ దర్శకుడు అంటున్నాడు.

ఆయన నాగార్జున తో చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఇంత స్పీడ్ గా నాగార్జున సినిమాను చేయవచ్చా అన్నట్లుగా ఆశ్చర్యపోతున్నాడట.1980 మరియు 90 ల్లో నాగార్జున రెండు మూడు నెలల్లో సినిమాలను పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయి.అప్పట్లో ఏడాదికి అరడజను సినిమాలు వచ్చేవి.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

అయినా కూడా మేకింగ్‌ విషయం లో కన్ఫ్యూజన్‌ ఉండేది కాదు.కానీ ఇప్పుడు ఒక సినిమా ను ఏడాది చేసినా కూడా బాబోయ్ అన్నట్లుగా హడావుడి, గందరగోళం కనిపిస్తోంది.

Advertisement

భారీ ఎత్తున స్టార్‌ హీరోల సినిమా లకు ఖర్చు చేస్తున్న కారణంగా నిర్మాతల శ్రేయస్సు నిమిత్తం మెల్లగా చేస్తున్నాం అంటూ దర్శకులు చెబుతున్నారు.కానీ నా సామిరంగ సినిమా మాత్రం స్పీడ్ గా రూపొందుతోంది.

తాజా వార్తలు