టాలీవుడ్ కింగ్ నాగార్జున( King Nagarjuna ) ఈ మధ్య కాలం లో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.ఇప్పటి వరకు ఈయన సినిమా లు అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా అభిప్రాయం ఉండేది.
కానీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్స్ పడటం తో అసలు నాగార్జున హీరో గా సినిమా లు చేయడం అవసరమా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా లో వస్తున్న ట్రోల్స్ కి గట్టి సమాధానం అన్నట్లుగా నా సామి రంగ సినిమా ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అక్కినేని ఫ్యాన్స్( Akkineni Fans ) చాలా నమ్మకంగా ఉన్నారు.
నాగార్జున మరియు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్న ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

షూటింగ్ ప్రారంభం సందర్భంగానే సినిమా( Naa Saami Ranga Movie ) ను సంక్రాంతికి విడుదల చేస్తాం అన్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల అనేది కచ్చితంగా చాలా రిస్కీ విషయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎంత రిస్క్ అయినా కూడా కచ్చితంగా తాను సంక్రాంతి( Sankranthi Release )కి వస్తాను అన్నట్లుగా నాగార్జున చాలా బలంగా ఉన్నాడు.
ఇప్పటికే నాగార్జున నటించిన సినిమాల విషయం లో చాలా ఆసక్తి నెలకొంది.ఈ సినిమా విషయం లో చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు.

అంతే కాకుండా ఈ సినిమా కి సంబంధించిన టీజర్ మరియు ఫస్ట్ లుక్ సినిమా( Naa Saami Ranga Movie Teaser ) పై అంచనాలు పెంచాయి.కనుక సంక్రాంతికి వస్తే ఎంత పెద్ద పోటీ ఉన్నా కూడా కచ్చితంగా నా సామి రంగ సినిమా విడుదల అవ్వడం ఖాయం అన్నట్లుగా అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మీడియా సర్కిల్స్ వారు నమ్మకంగా చెబుతున్నారు.నాగార్జున సినిమా అనగానే ఒక వర్గం ఆడియన్స్ లో ఆసక్తి ఉంటుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం నాగ్ మూవీ అన్నట్లుగా ఉంటుంది.కనుక నా సామి రంగ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అనడం లో సందేహం లేదు.







