బయట సినిమాల్లోనే నాగార్జునకి మంచి స్కోప్ ఉంటుందా? తెలుగు సినిమాల్లో ఉండదా?

అక్కినేని వారసుడు కింగ్ నాగార్జున ( King Nagarjuna )గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ సంపాదించుకున్న నటులలో నటుడు నాగార్జున ఒకరు.

అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageswara Rao )వారసుడిగా తెలుగు తెరకి పరిచయం అయిన నాగ్ అనతికాలంలోనే అన్నమయ్య అనే భక్తిరస చిత్రం ద్వారా మంచి నటుడిగా అవతరించాడు.ఈ క్రమంలో ఆయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించాడు.

అందుకే నాగ్ అనే అక్కడి వారికి కూడా బాగా తెలుసు.ఇక చాన్నాళ్ల తరువాత నాగ్ ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నట్టు కనబడుతోంది.

రజనీకాంత్ ‘కూలీ ‘ సినిమాలో( Coolie ) నాగ్ విలన్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసినదే.అదే విధంగా ధనుష్ సినిమాలో కూడా ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలను మినహాయిస్తే ఆయన ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటి పాత్రలో ఆయన నటించింది లేదు.

Advertisement

ఈ తరుణంలో ఇలాంటి భిన్నమైన పాత్రలు ఆయనికి ఎందుకు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తెలుగులో అటువంటి స్కోప్ ఉన్న పాత్రలు చేయలేదు.ఇక్కడ దాదాపు హీరోగా సాఫ్ట్ కార్నర్ ఉన్న పాత్రలనే చేయడం జరిగింది.

ఇక రీసెంటుగా కూలీ చిత్రంలో ఆయన చేసిన పాత్ర యొక్క ఫస్ట్ లుక్ మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా అక్కినేని అభిమానులు( Akkineni fans ) ఖుషీ అయిపోయారు.ఈ క్రమంలో ఆయన విశ్లేషకులనుండి కూడా మన్ననలు పొందారు.

టాలీవుడ్ కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ఇక్కడ కాకుండా నాగ్ తమిళంలో అటువంటి పాత్రలు చేస్తుండడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.విషయం ఏమిటంటే, ఇక్కడ దర్శకనిర్మాతలు నాగ్ ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని టాక్ నడుస్తోంది.నాగ్ స్ట్రెంగ్త్ కనిపెట్టిన తమిళ దర్శకులు మాత్రమే కింగ్ నాగార్జునని బాగా వాడుతున్నారని టాక్ నడుస్తోంది.

కాగా కూలీ సినిమాలో విలన్ పాత్ర అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్.ఈ నేపథ్యంలోనే విక్రమ్ సినిమాలో సూర్య పోషించిన ‘రోలెక్స్ ‘ క్యారెక్టర్ ఎంత పాపులారిటిని సంపాదించుకుందో నాగార్జున క్యారెక్టర్ కూడా అలాంటి ఒక గుర్తింపును సంపాదించుకుంటుందంటూ అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అల్లు శిరీష్ కి డబ్బుల విలువ తెలియడానికి ఆ పరీక్ష పెట్టారట అరవింద్!
Advertisement

తాజా వార్తలు