నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం దాదాపుగా అయిదేళ్లు పూర్తి చేసుకుంది.ఆ సినిమా సమయంలో బంగార్రాజు సినిమాను ప్రకటించారు.
నాగార్జున చాలా ఆసక్తిగా బంగార్రాజు సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించాడు.బంగార్రాజు పాత్ర చుట్టు కథ అల్లి దాన్ని సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌గా ప్లాన్ చేయాలనుకున్నారు.
కాని ఇప్పటి వరకు అది అడుగు ముందుకు పడ్డట్లుగా అనిపించడం లేదు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సుదీర్ఘ కాలంగా బంగార్రాజు స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూనే ఉన్నాడు.
ఈయన గత ఏడాదిలోనే మన్మధుడు 2 చిత్రం సమయంలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.కాని ఆ సమయంలో నాగార్జున కొన్ని కారణాలు చెప్పి వాయిదా వేశాడు.
ఇక ఈ ఏడాది ఎలాగైనా ప్రారంభించేవారు.కాని కరోనా కారణంగా సినిమా మళ్లీ వాయిదా వేయడం జరిగింది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బంగార్రాజు ఈ ఏడాదికి లేనట్లే అంటూ క్లారిటీ వచ్చేసింది.ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రంతో పాటు హిందీలో ఒక సినిమా తమిళంలో ధనుష్‌తో కలిసి మరో సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాలు అన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు బంగార్రాజు సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు.