సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) తాజాగా తండేల్( Thandel ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
నాగచైతన్య సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య ఎన్నో సినిమాలలో నటించిన ఒక హిట్టు కూడా అందుకోలేక పోయారు.అయితే తిరిగి ఈయన మరోసారి సాయి పల్లవితో కలిసి తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాగచైతన్యతో పాటు అక్కినేని అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమా చూసి వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు కానీ తన కొడుకు సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో నాగార్జున( Nagarjuna ) ఏ మాత్రం స్పందించలేదంటూ వార్తలు వచ్చాయి కానీ నాగార్జున తండేల్ సినిమా సక్సెస్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాగచైతన్య పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఈయన ట్వీట్ చేస్తూ…

ప్రియమైన చైతు. నేను గర్వపడుతున్నాను.సరిహద్దులను దాటి పోతూ, సవాళ్లను ఎదుర్కొంటూ కళకు నీ గుండెను ఇచ్చినట్లు చూశాను.
తండేల్ కేవలం సినిమా మాత్రమే కాదు.నీ అభిరుచి నీవు కష్టపడి సాధించిన విజయానికి ఇది నిదర్శనం అంటూ తన కొడుకు సినిమాపై నాగార్జున స్పందిస్తూ చైతన్య నటనకు ప్రశంసల కురిపించడమే కాకుండా తాను ఒక తండ్రిగా కూడా ఎంతో గర్వపడుతున్నానని నాగార్జున చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమా సక్సెస్ కోసం నాగచైతన్య కూడా ఎంతో కష్టపడ్డారని సినిమా చూస్తేనే స్పష్టం అవుతుంది.







