సినీనటి సాయి పల్లవి( Sai Pallavi ) ప్రస్తుతం వరుస హిట్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అంతగా ఈమె తండేల్( Thandel ) సినిమాతో మరో హిట్ సొంతం చేసుకున్నారు.
నాగచైతన్య( Nagachaitanya ) సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక సాయి పల్లవి నటన మాత్రమే కాదు డాన్స్ కూడా అద్భుతంగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.
అయితే సాయి పల్లవి మాట్లాడుతూ తన తల్లి డాన్సర్ కావడంతో చిన్నప్పటి నుంచి కూడా నాకు డాన్స్ పై చాలా ఇష్టం ఉండేదని తెలిపారు.ఇక సినిమాలపై కూడా ఎంతో ఆసక్తి ఉన్న నేను ఇంట్లో వారికి తెలియకుండా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు వెళ్లి సినిమాలను చూసేదాన్ని తెలిపారు.

ఇక చిన్నప్పటినుంచి కూడా తాను సినిమాలలో నటిస్తే ఒక్కసారైనా హీరో సూర్యతో( Hero Suriya ) కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నాను అయితే అనుకున్న విధంగానే సూర్య గారితో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు.ఇక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పౌరాణిక సినిమాలలో నటించాలన్నదే నా చిరకాల కోరిక అని సాయిపల్లవి తెలియజేశారు.అందుకే నాకు రామాయణం( Ramayanam ) సినిమాలో అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకున్నానని ఈ సినిమాలో నటించడానికి కూడా కారణం అదేనని తెలిపారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో రామాయణం సినిమా గురించి సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







