ఎన్టీఆర్ తో పోటిలో నాగచైతన్య

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రతి షెడ్యులు అనుకున్న టైం ప్రకారమే జరుగుతోంది.ఈ స్పీడు చూస్తోంటే, ముందే ప్రకటించినట్టుగా ఆగస్టు 12న ఈ సినిమా విడుదల అవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఇప్పటివరకు మా సినిమాకి పోటి లేదని సంబరపడ్డ నిర్మాతలకు చిన్నిపాటి షాక్ ఇచ్చేలా ఉన్నాడు నాగచైతన్య.ఈ అక్కినేని హీరో నటిస్తున్న ప్రేమమ్ ని సరిగ్గా ఆగస్టు 12నే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట ఆ చిత్రం యొక్క నిర్మాతలు.

ఇదే నిజమైతే, యంగ్ టైగర్ తో బాక్సాఫీస్ బరిలో తలపడతాడు చైతు.ఎన్టీఆర్ రేంజ్ చాలా పెద్దదే అయినా, స్క్రీన్స్ చాలావరకు మింగేస్తుంది ప్రేమమ్.

Advertisement

అప్పుడు రికార్డు రిలీజ్ కష్టమైపోతుంది జనతా గ్యారేజ్ కు.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు
Advertisement

తాజా వార్తలు