మహేష్ బాబుకు జేజేలు కొట్టిన నాగ చైతన్య.. ఎందుకంటే..?!

తాజాగా ఓ సంఘటనలో భాగంగా ఒక్కడు సినిమా రిలీజ్ సమయంలో హీరో మహేష్ బాబు భారీ కటౌట్ కు అక్కినేని హీరో అక్కినేని నాగచైతన్య క్షీరాభిషేకం చేశాడు.అంతే కాదు అక్కడ ఉన్న ఎంతోమంది అభిమానులు కూడా మహేష్ బాబుకు పెద్ద ఎత్తున జేజేలు కొట్టారు.

అదేంటి ఒక్కడు సినిమా ఎప్పుడో వచ్చేసింది కదా.ఇప్పుడు ఎందుకు జేజేలు కొడుతున్నారు అని అనుకుంటున్నారు కదా.అందులోనూ అక్కినేని వారసుడు మహేష్ బాబు కటౌట్ కి క్షీరాభిషేకం చేయడం ఏంటి.?! అని మైండ్ బ్లాక్ అవుతుంది కదా.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఈ సంఘటన మొత్తం సోమవారం నాడు రాజమహేంద్రవరం లోని అశోక థియేటర్ వద్ద జరిగింది.

విక్రమ్ కుమార్ దర్శకత్వం, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా లో అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వీరు నటిస్తున్న సినిమాకు థాంక్యూ అనే నామకరణం చేశారు.

అయితే ఈ చిత్రంలోని షూటింగ్ నేపథ్యంలో భాగంగా ఒక్కడు సినిమా రిలీజ్ సన్నివేశంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

ఈ సంఘటనలో అక్కినేని వారసుడు నాగచైతన్య ఒక్కడు సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ బాబుకు సంబంధించిన కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు పాటు.థియేటర్ లో హీరో హీరోయిన్ల మధ్య మరికొన్ని సన్నివేశాలను తీశారు దర్శకనిర్మాతలు.దీంతో రాజమహేంద్రవరంలో థియేటర్ వద్ద నాగచైతన్య ను చూసేందుకు అక్కినేని అభిమానులతోపాటు చాలామంది పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రాంతం మొత్తం సందడి సందడిగా మారింది.

వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..
Advertisement

తాజా వార్తలు