సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు కొంతమంది హీరోహీరోయిన్లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.అలా క్రేజ్ ఉన్న కాంబినేషన్లలో నాగచైతన్య కృతిశెట్టి కాంబినేషన్ కూడా ఒకటి.
నాగచైతన్య కృతిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.అయితే చైతన్య కృతిశెట్టి మళ్లీ రిపీట్ కానుందని సమాచారం అందుతోంది.
వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నాగచైతన్య ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి ఫైనల్ అయ్యారు.
నాగచైతన్య నటించిన థాంక్యూ జులై 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలైన తర్వాత వెంకట్ ప్రభు సినిమా షూటింగ్ లో చైతన్య పాలొననున్నారు.
మానాడు సినిమాతో వెంకట్ ప్రభు సక్సెస్ సాధించారు.
తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే దర్శకునిగా వెంకట్ ప్రభు రేంజ్ పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
చైతన్య ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదున్నారు.తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని చైతన్య భావిస్తున్నారు.
మరోవైపు చైతన్య పాన్ ఇండియా హీరోగా సత్తా చాటాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.చైతన్య కృతిశెట్టి జోడీ బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నాగచైతన్య ప్రస్తుతం సినిమాను బట్టి 8 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే చైతన్య రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. చైతన్య ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉంటున్నారు.చైతన్య ఈ మధ్య కాలంలో పలు వివాదాస్పద వార్తల ద్వారా వార్తల్లో నిలిచారు.