సినీ నటి సాయి పల్లవి( Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక సాయి పల్లవి ఎంపిక చేసుకుని పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.ఇక ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఇప్పటివరకు ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇక త్వరలోనే ఈమె నాగచైతన్యతో కలిసి నటించిన తండేల్( Thandel ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య( Nagachaitanya ) రానా( Rana ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షో( The Rana Daggubati Show ) కి హాజరైన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ వ్యక్తిగత విషయాల గురించి అలాగే సినిమా విషయాల గురించి కూడా మాట్లాడారు.అయితే రానా సాయి పల్లవి గురించి నాగచైతన్యను ప్రశ్నించడంతో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సాయి పల్లవితో డాన్స్ చేయాలంటే ఆయాసం వచ్చేస్తుంది బావ తను చాలా యాక్టివ్ అంటూ సాయి పల్లవి నటన గురించి తెలిపారు.అయినా నువ్వు విరాటపర్వం సినిమాలో తనతో ఒక్క పాట కూడా చేయకుండా బాగా ఎస్కేప్ అయ్యావు అంటూ ఆట పట్టించారు.

ఇలా వీరిద్దరే మధ్య సాయి పల్లవి గురించి మాటలు రావడంతో సాయి పల్లవికి రానా ఫోన్ చేసి సరదాగా మాట్లాడారు.ఇక నాగచైతన్య గురించి సాయి పల్లవిని రానా ప్రశ్నించడంతో తాను చాలా కూల్ గా ఉంటారు.ఎంత కోపం వచ్చినా చాలా ప్రశాంతంగానే సమాధానం చెబుతారు.ఇకపోతే ఏదైనా నచ్చలేదు అంటే కూడా ఆయన సమాధానం చెప్పరు.ఆ విషయంలో నాకు చాలా చిరాకు వస్తుంది అంటూ సాయి పల్లవి చెప్పడంతో వెంటనే నాగచైతన్య మనం చెప్పకపోయినా మన పాత్ర గురించి ఇక్కడ ఎడిట్ చేయాలి.అక్కడ బాగుంది ఇక్కడ బాలేదంటూ అన్ని తానే చెబుతుంది.
ఇక మనమెందుకు కష్టపడటం.సాయి పల్లవి సెట్లో యాక్టర్ లాంటి డైరెక్టర్ అంటూ సాయి పల్లవి పై ప్రశంసల కురిపించారు.
ఇలా వీరి మధ్య ఎంతో సరదా సంభాషణ కొనసాగింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.







