మన శరీరాన్ని అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలకు గుడ్డు పవర్ హౌస్ లాంటిది.నిత్యం ఒక గుడ్డును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
వివిధ రోగాలకు దూరంగా ఉండవచ్చు.అయితే గుడ్లను కొందరు ఆమ్లెట్ ( Omelette ) రూపంలో తినడానికి ఇష్టపడతారు.
ఇంకొందరు ఉడికించిన గుడ్డు( Boiled Egg ) తింటారు.మరి ఆమ్లెట్ మరియు ఉడికించిన గుడ్డులో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అని ఎప్పుడైనా ఆలోచించారా.? నిజానికి రెండూ ఆరోగ్యకరమే.రెండూ పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ఉడికించిన గుడ్లు ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది.ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ ఇ వంటి పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న కంప్లీట్ ప్రోటీన్ గుడ్డులో ఉంటుంది.
ఇది కండరాల మరమ్మత్తు మరియు పెరుగుదలకు, శరీర బరువు నిర్వాహనకు తోడ్పడుతుంది.

గుడ్లలో మెండుగా ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు( Omega-3 Fatty Acids ) మెదడు పని తీరును నిర్వహించడానికి సహాయపడతాయి.అలాగే గుడ్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.గుండె ఆరోగ్యాన్ని( Heart Health ) మెరుగుపరుస్తాయి.
గుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇక ఆమ్లెట్ విషయానికి వస్తే.ఇది రుచికరమైనవి మరియు ఆరోగ్యకరమైనది.ఆమ్లెట్ తయారీలో మీరు కూరగాయలను జోడించినట్లైతే.
ఎక్కువ పోషకాలు లభిస్తాయి.కానీ వెన్న, వంట నూనెలు వంటి పదార్థాలను వాడటం వల్ల ఆమ్లెట్‌లలో కేలరీలు మరియు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.
స్వచ్ఛమైన పోషకాహారం పరంగా ఉడికించిన గుడ్డు బెస్ట్ అని చెప్పుకోవచ్చు.పోషక పదార్ధాలతో ఆలోచనాత్మకంగా తయారు చేసినప్పుడు ఉడికించిన గుడ్ల కంటే ఆమ్లెట్ ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది.







