నాగబాబు బుస కొడుతుంటే.. రోజా ఎలా విచ్చుకుందో చూడండి!

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్‌ ఈటీవీలో వచ్చే జబర్దస్త్‌ షో తెలుసు కదా.సుమారు ఏడేళ్లుగా ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

నవ్వులు పూయిస్తోంది.బూతు డోసు కాస్త ఎక్కువైందన్న విమర్శలు ఉన్నా కూడా.

ఈ షో మాత్రం ఈటీవీని టాప్‌లో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే అలాంటి జబర్దస్త్‌లో సడెన్‌గా ఓ పెద్ద కుదుపు ఏర్పడింది.

ఈ షో నుంచి జడ్జి నాగబాబుతోపాటు పలువురు ప్రముఖ కమెడియన్లు మరో చానెల్‌కు వెళ్లిపోయారు.కమెడియన్లు పండించే జోకులకు పడీపడీ నవ్వుతూ నాగబాబు.

Advertisement

ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఒకరకంగా జబర్దస్త్‌.

ఇటు ఈటీవీకి, అటు నాగబాబుకు కూడా ఎంతగానో ఉపయోగపడింది.ఆర్థికంగా నాగబాబు కష్టాల్లో ఉన్న సమయంలో ఈ షో ఆయనను ఆదుకుంది.

ఇదే విషయాన్ని చెబుతూ ఆయన తన యూట్యూబ్‌ చానెల్‌ నాఇష్టంలో ఓ వీడియో కూడా పోస్ట్‌ చేశాడు.అయితే ఆ తర్వాత వరుసగా మరికొన్ని వీడియోలు కూడా పోస్ట్‌ చేసి ఈ షోపై తన అక్కసును వెళ్లగక్కారు.

మొదట్లో తనను ఆదుకున్న ఈ షోనే ఇప్పుడు తనను, మిగతా ఆర్టిస్టులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

ఈ షోని వాడుకొని మంచి సక్సెస్‌ సాధించారు తప్ప తమకు ఏమీ చేయలేదని ఆయన చెప్పడం విశేషం.ఆరున్నరేళ్లపాటు తనను ఆదుకున్న షోపై నాగబాబు ఇలా ఆరోపణలు చేస్తుండగా.మరోవైపు ఆయనతోపాటు జడ్జిగా వ్యవహరించిన నటి, ఎమ్మెల్యే రోజా మాత్రం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Advertisement

నాగబాబులాగే ఈ షో నుంచి ఆమె కూడా వెళ్లిపోతుందన్న వార్తల నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్‌ను మరో లక్ష పెంచారట.

అంతకుముందే షోకు లక్షన్నర అందుకునేవారు.దీనికితోడు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా నెలకు లక్షల కొద్దీ ఆదాయం వస్తూనే ఉంది.ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఆశించి భంగపడినా.

కేబినెట్‌ హోదానే ఉన్న ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ పదవి దక్కించుకున్నారు.ఆ హోదాను బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇటు జబర్దస్త్‌ షో నుంచి నాగబాబు వెళ్లిపోవడం కూడా పరోక్షంగా ఆమెకు కలిసొచ్చింది.

తాజా వార్తలు