తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవికి ఉన్న గుర్తింపు మామూలుది కాదు.ఆయన తన చక్కటి అభినయం, అణకువతో తెలుగు సినిమా రంగాన్నే ఏలే స్థాయికి చేరాడు.
క్రమశిక్షణ.ఎదుటివారిని గౌరవించడంలో చిరంజీవి తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు.
అయితే తన అన్న విషయంలో తనకు నచ్చని ఓ విషయం ఉందని చెప్పాడు నాగబాబు. ఇంతకీ అదేంటంటే తెగింపు.
సినిమాల్లో ఫైట్స్ చేసే విషయంలో చిరంజీవి చేసే రిస్క్ తనకు నచ్చేది కాదని.పైగా కోపం వచ్చేదని చెప్పాడు.
ఓసారి ఈ విషయంలో తన అన్నతో గొడవ పడినట్లు కూడా వెల్లడించాడు.కానీ చిరంజీవి పట్టించుకోలేదట.
ఇంతకీ ఆ ఫైట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ అట్లాంటిక్ పైన మూడున్నర అడుగుల వెడల్పు ఉన్న ఓ చిన్న గోడ మీద ఫైట్.
దాదాపు 10 అంతస్థుల పిట్టగోడ మీద ఫైట్ అంటే చాలా డేంజర్.వెంటనే నాగబాబుకు టెన్షన్ వచ్చింది.
ఈ ఫైట్ చూడలేక ఇంటికి వెళ్లి.తన తండ్రితో దెబ్బలాడాడు.
అయితే ఈ ఫైట్ విషయంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదు.అటు సంఘర్షణ చిత్రంలో మాత్రం ఓ ఫైట్ చేస్తుండగా గాయాలు అయ్యాయి.
త్రినేత్రుడు సినిమాలోని గ్లోబ్ ఫైట్‌ను కూడా ఆయన వద్దని వారించాడు.అయితే తెలుగు సినిమా హీరోల్లో అంతటి రిస్క్ మరెవరూ చేసి ఉండరు అంటాడు నాగబాబు.
ఈ ఫైట్ ఆరు రోజుల పాటు తీసినట్లు చెప్పాడు.కనీసం మా సినిమాలోనైనా రిస్కీ ఫైట్లు వద్దని చెప్పినట్లు నాగబాబు వెల్లడించాడు.

అటు తన అన్నయ్య చిరంజీవి చేసిన అన్ని సినిమాలు ఇష్టమే అయినా.పున్నమి నాగు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు.అందులోని పాత్రను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చెప్పాడు.అందులో యాంటీ హీరోగా చిరంజీవి అద్భుతమైన నటన కనబర్చాడని చెప్పాడు.ఆ తర్వాత జ్వాల, రక్తసింధూరం సినిమాల్లోనూ చక్కగా నటించాడని చెప్పాడు.అలాంటి పాత్రలు మళ్లీ చేస్తే బాగుంటుందని చెప్పాడు.