విద్యార్ధుల ప్రాణాలు పోవడానికి కారణం ఆ ఇద్దరే అంటున్న నాగబాబు!

ఈ మధ్యకాలంలో రాజకీయాలలోకి వచ్చిన తర్వాత నాగబాబు ఎక్కువగా సమాజంలో జరిగే విషయాల మీద స్పందిస్తూ తన అభిప్రాయాలని తెలియజేస్తున్నాడు.

అతని మాటలతో అయిన కొంత మందిలో అయిన ఆలోచన వచ్చి మారుతారేమో అనే ప్రయత్నంతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణా, ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ పరీక్షలలో ఫెయిల్ అయ్యామనే బాధతో చాలా మంది విద్యార్ధులు ప్రాణాలు తీసుకున్నారు.

ప్రతి ఏడాది ఇంటర్ ఫలితాల సమయంలో చాలా మంది విద్యార్ధులు బలైపోతున్నారు.ఈ నేపధ్యంలో విద్యార్ధుల బలవన్మరణాలపై నాగబాబు ఒక వీడియో రిలీజ్ చేసారు.

అమాయకమైన పసిమొగ్గలు చనిపోవడానికి కారణం తల్లిదండ్రుల ఆలోచన తీరు, కొన్ని విద్యాసంస్థల స్వార్థచింతనే అనే మండి పడ్డారు.ఎవో మార్కులు తక్కువ వచ్చాయని, ఏదో ఒక సబ్జెక్ట్లో ఫేయిల్ అయ్యానని చనిపోతున్నారు.

Advertisement

దీనికంతటి కారణం ఎవరు.అని ప్రశ్నిస్తూ.

తల్లిదండ్రల ఆలోచన తీరు మారాలన్నారు.అలాగే ప్రస్తుతం విద్యావ్యవస్థని నాశనం చేసి విద్యార్ధుల మార్కులే ప్రామాణికంగా చదువులు చెబుతున్న కార్పోరేట్ విద్యావిధానం కూడా మారాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు