సూపర్ : బస్తీ బాయ్స్ పై మీమ్స్ చేస్తే ఐ ఫోన్ గిఫ్ట్ ఇస్తానంటున్న నాగబాబు...

ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా సినిమా షూటింగులు మరియు పలు చోట్ల సినిమా థియేటర్లు మూత పడటంతో ఓటిటీలలో విడుదలయ్యే వెబ్ సీరీస్ లకి మంచి డిమాండ్ ఏర్పడింది.దీంతో ఇప్పటికే కొందరు నటీనటులు ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు.

 Nagababu Announce Iphone Gift For Meme Page Admins, Iphone News, Nagababu, Telu-TeluguStop.com

కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మరియు నటుడు మెగా బ్రదర్ నాగబాబు “బస్తీ బాయ్స్” అనే ఓ కామెడీ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నాడు.

కాగా ఈ వెబ్ సీరీస్ కి జబర్దస్త్ కామెడీ షోలో పలు స్కిట్లతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన “బుల్లెట్ భాస్కర్” దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ని యూట్యూబ్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాకుండా ప్రస్తుతం ఈ బస్తీ బాయ్స్ మొదటి ఎపిసోడ్ యూట్యూబ్ లో మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

కాగా ఈ వెబ్ సిరీస్ లో “అదిరింది షో ఫేమ్ సద్దాం మరియు ఇతర కమేడియన్లు” నటిస్తున్నారు.

అయితే ఈ వెబ్ సిరీస్ నిర్మాత నాగబాబు ప్రమోషన్స్ లో భాగంగా బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ పై మీమ్స్ చేసేవారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఇందులో భాగంగా బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్స్ చూసి మీమ్స్ చేయాలని ఇలా చేసిన వాటిలో ఎక్కువ రీచ్ వచ్చిన పేజ్ అడ్మిన్స్ కి ఐఫోన్ గిఫ్ట్ గా ఇవ్వబడుతుందని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశాడు.అలాగే మీమ్స్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసేటప్పుడు కచ్చితంగా #Basthiboysmemes అనే హ్యాష్ టాగ్ ని జతపర్చడం మరచి పోవద్దని కూడా తెలిపాడు.

దీంతో మీమ్స్ పేజ్ క్రియేటర్స్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.అంతేకాకుండా మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు కూడా మీమ్ పేజ్ అడ్మిన్స్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడని తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో నాగబాబు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జీ తెలుగు లో ప్రసారమయ్యే “అదిరింది షో” లో జడ్జిగా వ్యవహరించేవాడు.కానీ అనుకోకుండా ఈ కామెడీ షో ఆగిపోవడంతో ఈ షోలో పనిచేస్తున్న కమెడియన్లు ఉపాధి కోల్పోయారు.

దీంతో నాగబాబు వారిని ఎంకరేజ్ చేసేందుకు గాను తానే బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube