Rangabali Review: రంగబలి రివ్యూ: నాగశౌర్య హిట్ కొట్టినట్లేనా?

డైరెక్టర్ పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా రంగబలి.( Rangabali Movie ) ఈ సినిమాలో నాగశౌర్య,( Naga Shaurya ) యుక్తి తరేజా( Yukti Tareja ) జంటగా నటించిన షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళి శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించారు.

 Naga Shaurya Yukti Tareja Rangabali Movie Review And Rating-TeluguStop.com

ఇక ఈ సినిమాకు దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.పవన్ సిహెచ్ సంగీతం అందించాడు.

ఇక సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాతకు బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్, టైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.

ఇక ఈరోజు సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా సరైన సక్సెస్ కోసం చూస్తున్న నాగశౌర్యకు కూడా ఈ సినిమా ఏ విధంగా సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఆంధ్రప్రదేశ్ లో రాజవరంలో రంగబలి అనే సెంటర్ పేరు ఉంటుంది.ఇక నాగశౌర్యకు ఆ ఊరు అంటే చాలా ఇష్టం.అంతేకాకుండా సెంటిమెంట్ అని కూడా చెప్పాలి.ఇక విశాఖలోని మెడికల్ కాలేజీలో చదువుతున్న సహజ అనే అమ్మాయిని ఇష్టపడతాడు నాగశౌర్య.

అంతేకాకుండా ప్రేమలో పడతాడు.ఇక సహజ ( Sahaja ) తన ప్రేమ విషయాని తన తండ్రి మురళి శర్మకు చెప్పటంతో మొదట ఆయన ఈ ప్రేమ పెళ్లికి ఒప్పుకోగా.

నాగశౌర్య ది రంగబలి అనే ఊరు అని తెలియడంతో వెంటనే మురళి శర్మ నాగ శౌర్యను ఆ ఊరు వదిలేసి విశాఖకు రమ్మంటాడు.కానీ శౌర్య మాత్రం రాను అంటాడు.

అలా ప్రేమించిన అమ్మాయి కోసం ఊరిని కూడా వదలకుండా నాగశౌర్య ఎందుకు రాను అన్నాడు.తనకు ఆ ఊరికి ఉన్న సంబంధం.

అసలు ఆ ఊరి వెనుక ఉన్న రహస్యం ఏంటి.చివరికి వారిద్దరు ఒకటవుతారా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu @satya, Brahmaji, Murali Sharma, Nagashaurya, Rangabali, Rangabali Story,

నటినటుల నటన:

విషయానికి వస్తే.నాగశౌర్య నటన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో కూడా ఒక యువకుడి పాత్రలో సులువుగా నటించాడు.ఎమోషన్స్ సీన్స్ లలో బాగా లీనమయ్యాడు.హీరోయిన్ యుక్తి తరేజ కూడా బాగానే పర్ఫామెన్స్ చేసింది.రొమాంటిక్ సీన్స్ లో కూడా బాగా రెచ్చిపోయింది.

షైన్ టామ్ చాకో నెగటివ్ పాత్రలు బాగా అదరగొట్టాడు.సత్య( Satya ) కామెడీ టైమింగ్ కూడా బాగుంది.మిగిలిన నటీనటులు తమ పాత్రకు తగ్గట్టు పని చేశారు.

టెక్నికల్:

డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా చూపించడానికి బాగా ప్రయత్నం చేశాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.సంగీతం పర్వాలేదు.ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు పనిచేస్తాయి.

Telugu @satya, Brahmaji, Murali Sharma, Nagashaurya, Rangabali, Rangabali Story,

విశ్లేషణ:

ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయాలతో, ఎలివేషన్ సీన్స్, కామెడీతో చూపించాడు.హీరో, హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ బాగానే చూపించాడు.అంతేకాకుండా తండ్రి కొడుకు మధ్య ఉండే అనుబంధంను కూడా చక్కగా చూపించాడు.ఇక ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా చేశాడు.కానీ సెకండ్ హాఫ్ లో కాస్త విఫలమైనట్టు కనిపించాడు.

ప్లస్ పాయింట్స్:

కథ, ఫస్టాఫ్, కొన్ని సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, కామెడీ.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ అంతగా కనెక్ట్ కాలేదు.ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది.

Telugu @satya, Brahmaji, Murali Sharma, Nagashaurya, Rangabali, Rangabali Story,

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఒక కామెడీ ఎమోషనల్ డ్రామా తో వచ్చింది కాబట్టి ఒకసారి చూడవచ్చు.ఇక ఈసారి కూడా నాగశౌర్య అంతంత మాత్రమే సక్సెస్ అందుకున్నాడని అర్థమవుతుంది.

రేటింగ్: 2.0/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube