'థాంక్యూ' నుండి ఫస్ట్ లుక్ విడుదల.. స్టైలిష్ లుక్ లో చై!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.

ఈ మధ్యనే నాగ చైతన్య శేఖర్ కమ్ములతో చేసిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాతో మరికొంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు చైతూ.ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను విక్రమ్ హర్రర్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

ఇక ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాల నుండి వరుస అప్డేట్ లను వదులుతున్నారు మేకర్స్.అలాగే థాంక్యూ సినిమా నుండి కూడా నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ పోస్టర్ అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటుంది.ఈ పోస్టర్ లో నాగ చైతన్య సరికొత్త లుక్ లో కనిపించి అందరిని ఆకట్టు కుంటున్నాడు.

స్టైలిష్ గా మాత్రమే కాకుండా ఎనర్జిటిక్ గా కూడా కనిపిస్తున్నాడు.దీంతో ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రెసెంట్ ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇక చైతూ ఈ సినిమాతో పాటు నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా నుండి కూడా మేకర్స్ చిన్న బంగార్రాజు పేరుతొ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల చేసారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాలో కూడా చైతు డిఫెరెంట్ గా పంచెకట్టులో కనిపించి సూపర్ అనిపించాడు.

Advertisement

తాజా వార్తలు