సమంత…పరిచయం అక్కర్లేని పేరు.ఏం మాయ చేసావేతో కుర్రాళ్ళ హృదయాలకి గేలం వేసింది.
గత దశాబ్దం నుండి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దాదాపు అగ్ర హీరోలందరితో నటించి హిట్స్ అందుకుంది.సమంత హీరోయిన్ అంటే హిట్ గారంటీ అన్న సెంటిమెంట్ సంపాదించుకుంది.
ఆమె సినిమాలు వదిలేస్తుంది అని ఇటీవలే ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది.కానీ అది అవాస్తవం అని స్పందించింది సమంత.
టాప్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత మంచి పేరు తెచ్చుకుంది.చైతన్య సమంత ల లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు కదా.కాకపోతే ఈసారి ఇందులోనే ఓ కొత్త కోణం బయటపెట్టాడు చైతూ.ఏడేళ్లు ట్రై చేస్తే కానీ సమంత తనకు పడలేదంటున్నాడు.

అసలు కథ ఏంటంటే.సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ‘చి ల సౌ’ ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ మీట్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత, హీరో సుశాంత్, హీరోయిన్ రుహాని, దర్శకుడు రాహుల్ రవింద్రన్, ఆయన భార్య చిన్మయి పాల్గొన్నారు.
ప్రెస్ మీట్‌లో భాగంగా నాగచైతన్య, సమంత పెళ్లి ప్రయాణం గురించి చైతూని రాహుల్ రవింద్ర అడిగారు.

చైతన్య మాట్లాడుతూ.‘ఏడేళ్లపాటు ట్రై చేస్తూనే వచ్చాను.ఫైనల్‌గా ఆఖరి రెండేళ్లు.
సరే బాగానే కష్టపడుతున్నాడు వీడు అని సమంత ఓకే చెప్పేసింది’ అని అన్నారు.దీనికి సమంత నవ్వుతూ ‘పబ్లిక్‌గా ఇక్కడ అబద్ధం చెబుతున్నారు’ అని రాహుల్‌ను సాక్ష్యంగా పిలిచారు.
ఇక మైక్ అందుకున్న రాహుల్.‘నేను వెంటపడ్డాను, చాలా కష్టపడ్డాను అని మీరంటున్నారు.
నాకు సామ్ కూడా అదే చెప్పింది.మరి ఇద్దరూ కష్టపడి.
ఇద్దరూ ఒప్పుకోకపోవడమేంటి.అసలు సమస్యేంటి?’ అని ప్రశ్నించారు.దీనికి సమంత సమాధానం చెబుతూ.‘నా వెంట పడింది కేవలం చైతూ మాత్రమే.కానీ చైతూ వెంట చాలా మంది అమ్మాయిలు పడ్డారు.ఏడేళ్ల తరవాత నా టోకెన్ వచ్చింది’ అంటూ నవ్వుతూ చెప్పారు.
దీనిపై చైతు మాట్లాడుతూ “నా జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారనే విషయం నిజం కాదు.అంత సీన్ లేదు కూడా… సామ్ మసాలా వేసి చెబుతోంది.
ఇద్దరం ఇష్ట పడ్డాం.మా రిలేషన్ షిప్‌ను మరో లెవల్‌కి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం.” అని బదులిచ్చారు.







