కాక రేపుతున్న కాపు రాజకీయం.. పవన్ పరిస్థితి ఏంటో..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది.నాముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఆయన ఇరుక్కుపోయాడు.

 Pawan Kalyan Need To Speak Out Of Kapu Reservation-TeluguStop.com

కాపు రిజర్వేషన్ అంశం పై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేసాడనే అభిప్రాయం కాపుల్లో ఉంది.ఇక ప్రతిపక్ష నాయకుడు జగన్ తమ పార్టీ అభిప్రాయాన్ని కుండబద్దల కొట్టినట్టు బయటకి చెప్పెయ్యడంతో ఇప్పుడు అందరి చూపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పడింది.

ఈ అంశం పై పవన్ స్పందన ఎలా ఉండబోతోంది.? ఎలా ఉంటుంది అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఎందుకంటే పవన్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం కూడా ఒక కారణమే.

కాపు రిజర్వేషన్ విషయంలో తాను హామీ ఇవ్వలేను అని జగన్ మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టాడు.ఇక గత ఎన్నికల ముందేమో కాపులకు రిజర్వేషన్ల హామీని ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ హామీని నిలబెట్టుకోగా కాపులకు అనేక విషయాల్లో ద్రోహం చేస్తున్నాడు.రిజర్వేషన్ల కల్పన గురించి తను కేంద్రానికి పంపించేశానని.

ఇక కేంద్రం చేతిలో ఉందని.తనేం చేయలేను అని చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.

పైపైకి హడావుడి చేస్తున్నాడుకానీ.బాబు హడావుడిలో నిజాయితీ లేదు.

కాపులకు రిజర్వేషన్లు అంటూ హామీ ఇచ్చి నాలుగేళ్ల పాటు కాలయాపన చేసి చంద్రబాబు చివర్లో హడావుడి చేస్తున్నాడు.ఈ రకంగా చంద్రబాబు మోసం బయటపడింది.

అలాంటి మోసం తను చేయలేను అని, చేయగలిగింది మాత్రమే చేస్తా.చేయలేని హామీలను ఇవ్వను ని జగన్ తేల్చేశాడు.

కాపు ఉద్యమ సమయంలో పవన్ అప్పట్లోనే రకరకాలుగా మాట్లాడాడు.జగన్ స్పందన నేపథ్యంలో పవన్ ఏమంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.అయితే పవన్ కళ్యాణ్ జగన్ లా సూటిగా చెప్పగలడా? అనేది సందేహమే.ఎందుకంటే రిజర్వేషన్లు కల్పిస్తాను అని అంటే తను కేవలం కాపు నేతగా మిగిలిపోతాను, రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తే … ఇతర సామాజిక వర్గాలకు దూరం అవ్వాలి.

ఇందులో ఏది చేసినా పవన్ కి చిక్కే.అందుకే పవన్ ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.ఎందుకంటే పవన్ పార్టీ నడిచేది ముఖ్యంగా ఆ సామాజిక వర్గం అండ చూసుకునే.ఆ పార్టీ ముఖ్య నాయకులంతా కాపు కులస్తులే.

అందుకే పవన్ ఇంతగా ఆలోచనలో పడ్డాడు.కానీ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తొందరలోనే చెప్పాల్సిన పరిస్థితి పవన్ కు ఏర్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube