Nagababu Adipurush : ఆదిపురుష్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు.. దానికోసం సినిమా చూడాలంటూ?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆదిపురుష్ సినిమా( Adipurush )కు సంబంధించిన వార్తలు విషయాల గురించి చర్చించుకుంటున్నారు.నిన్న అనగా జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 Naga Babu Sends His Best Wishes To Prabhas Adipurush Team-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించేలా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది హీరోలు హీరోయిన్లు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా నటుడు నాగబాబు( Actor Nagababu ) స్పందిస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాగబాబు ఆ వీడియోలో మాట్లాడుతూ.నేను కూడా మీలాగే ఆదిపురుష్ ట్రైలర్ చూశాను తప్ప సినిమా చూడలేదు.కానీ, కచ్చితంగా సినిమా చూస్తాను.

ఎందుకంటే ఒక నిజమైన మనిషి ఎలా ఉండాలి అనేది మొదట నిరూపించిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. రామాయణం, మహాభారతం( Mahabharatham ) వంటి అద్భుతమైన గ్రంథాలు, కథలు ప్రపంచంలో ఎక్కడాలేవని నా అభిప్రాయం.

మహాభారతం జరిగుంటే అద్భుతం.జరగకపోతే మహాద్భుతం అని ఎవరో అన్నారు.

రామాయణం కూడా అంతే.రామాయణం జరుగుంటే అద్భుతం.

జరగకపోయుంటే మహాద్భుతం.మనిషి ఎలా ఉండాలి, ఎంత నిబద్ధతతో జీవించాలి అనే విషయాలను శ్రీరాముడు రుజువు చేస్తే సభ్యసమాజంలో ఒక మనిషి ఎలాంటి తెలివితేటలతో ఉండాలి.

ఎంత జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణుడు చెప్పాడు.ధర్మాన్ని అతిక్రమించకుండా ఎలా బతకాలో చెప్పిన అద్భుతమైన క్యారెక్టర్లు రాముడు, కృష్ణుడు అని తెలిపారు నాగబాబు.తాను చాలా మంది యువతీ యువకులను రామాయణం( Ramayanam ) గురించి తెలుసా అని అడిగానని, చాలా మందికి రామాయణం మీద బేసిక్ అభిప్రాయం తప్ప గొప్పగా తెలీయదని, వారు రామాయణం చదవలేదని నాగబాబు తెలిపారు.తాను మాత్రం రామాయణం, మహాభారతం పూర్తిగా చదివానని అన్నారు.

రామాయణం ఈరోజు ఆదిపురుష్ అనే పేరుతో విడుదలవుతుంటే హీరో ప్రభాస్ అనో, ఇంకొకళ్లనో నేను ఈ మాటలు చెప్పడం లేదు.ఒక అద్భుతమైన రామాయణ గాథను తెరకెక్కించి ఈరోజు మనకు చూపిస్తున్నారు.

మనం సినిమా చూసేది నిర్మాత కోసమో, హీరో ప్రభాస్( Hero Prabhas ) కోసమో మాత్రమే కాదు.మన హిందూ దేశంలో రామాయణం అనే గొప్ప గ్రంథం ఉంది, అది జరిగిందని నమ్మేవాళ్లు ఉన్నారు కాబట్టి చూడాలి చెప్పుకొచ్చారు నాగబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube