విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు.మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు అనడం విడ్డూరంగా ఉందన్నారు.
మంత్రుల కార్లపై దాడి జరిగినట్లు ఇంతవరకు పోలీసులు నిర్ధారించలేదని చెప్పారు.కేవలం వైసీపీ నేతలు మాత్రమే దాడి జరిగిందని ప్రకటిస్తున్నారని తెలిపారు.
జనసేన పార్టీ దాడులను ప్రోత్సహించదని నాదెండ్ల పేర్కొన్నారు.రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ కొత్త నాటకానికి తెరతీసిందని ఆయన ఆరోపించారు.