జనసేన ' వెన్నుపోటు' రాజకీయం ఇంత ఉందా ...?

జనసేన పార్టీ మీద ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు అందరి ఫోకస్ పెరిగింది.జనసేన లో వెన్నుపోటు రాజకీయాలు జరుగుతున్నాయని… పవన్ వాటిని చూసీ చుడన్నట్టుగా వదిలేస్తున్నదని… అలా అయితే తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే పడుతుంది అంటూ…కొంతమంది సూచనతో కూడిన విమర్శలు చేస్తున్నారు.

 Nadendla Manohar And Ravela Kishore Babu May Back Stab Pawan Kalyan-TeluguStop.com

ఈ వ్యాఖ్యలు మరీ ముఖ్యంగా… జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చేరినప్పటి నుంచి ఎక్కువయ్యాయి.రెండు నెలల క్రితం జనసేనలో చేరిన మనోహర్ అనతి కాలంలోనే పవన్ కుడి భుజంగా మారిపోయారు.

ఈయన పార్టీలో చేరినప్పటి నుంచి ముందు నుంచీ ఉన్న నాయకుల ప్రాధాన్యత కొంత తగ్గించి మనోహర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం పార్టీలోనూ… ప్రజల్లోనూ జోరందుకుంది.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కుమారుడిగా హుందాతనం కలిగిన మంచి రాజకీయ నేతగా… మనోహర్ కాంగ్రెస్ పార్టీలో గుర్త్తింపు పొందాడు.అందుకే… అందుకే కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు కట్టబెట్టింది.అలాగే 2004, 2009 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు జిల్లా తెనాలి శాసనసభా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శాసనసభ స్పీకర్‌గా కూడా పని చేశారు.అయితే, విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.ఇక అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్న మనోహర్ కు టీడీపీ , వైసీపీ పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు.కానీ పవన్ ఆహ్వానం మేరకు ఇటీవల జనసేనలో చేరారు.

అయితే తాజాగా జనసేనలో కీలకంగా మారిన మనోహర్ ను ఇప్పుడు అనేకమంది టార్గెట్ చేయడం చర్చనీయాంశం అయింది.సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నాదెండ్ల మనోహర్‌పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు.”ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినట్లు పవన్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తాడేమోనని భయంగా ఉంది.పవన్ కల్యాణ్‌ను జాగ్రత్తగా ఉండమని ఫ్యాన్స్ అందరూ చెప్పండి.

పవన్ కల్యాణ్‌ ఎంత సూపర్ స్టార్ అయినా.వెన్నుపోటు నుంచి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయాడు.

పీకే కూడా తప్పించుకోలేడు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పవన్ కల్యాణ్ ముందు బిజీగా ఉంటే, వెనుక నుంచి నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడవాలని చూస్తున్నాడు.

కోవర్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి నాకు సమాచారం ఉంది అంటూ వర్మ ట్విట్ చేయడం సంచలనం రేపింది.

అంతే కాదు పవన్ ని రాజకీయంగా దెబ్బతీసేందుకు జనసేనలో ఉండే వాళ్లలో కొందరు నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు.అందులో నాదెండ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు” అని కలకలం రేపాడు.అయితే దీనిపై ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించారు.” నాదెండ్ల మనోహర్ గురించి రాంగోపాల్ వర్మ చెప్పింది నిజమే! పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు.పవన్ కళ్యాణ్ కూడా కసాయవాడిని నమ్మే.అదే!.కాకపోతే వర్మగారు అంత త్వరగా నిజాలు బయటికి చెప్పి ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపించారు.అది నాకు నచ్చలేదు.నాకన్నా పెద్ద ఫ్యాన్ పవన్‌కి ఎవరూ ఉండకూడదు.వర్మతో సహా.” అని కత్తి సెటైరికల్‌గా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.అయితే కత్తి ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు.”నాందేడ్ల మనోహర్లు, రావెల కిషోర్ బాబులు కాదు జనసేనని కాపాడేది.వాళ్ళు బెటర్ ఛాన్స్ లు వస్తే జంప్ అయిపోతారు.అదను చూసుకుని వెన్నుపోట్లు పొడిచేస్తారు.దిలీప్ సుంకర,విష్ణు నాగిరెడ్డి లాంటి పవన్ కళ్యాణ్ పిచ్చొళ్లే జనసేనకి రక్ష.వాళ్ళకి సరైన స్థానం కల్పించలేకపోతే పవన్ కళ్యాణ్ అంత లూజర్ మరొకరు ఉండరు” అంటూ పోస్టు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube