మహానాయకుడు సినిమాపై నాదెండ్ల భాస్కరరావు ఆగ్రహం! పరువు నష్టం దావా!

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన మహానాయకుడు సినిమా తాజాగా రిలీజ్ అయ్యింది.

మొదటి సినిమా ఫ్లాప్ కారణంగా ఈ రెండో భాగం మీద అనుకున్న స్థాయిలో హైప్ రాలేదనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ఎక్కువగా చంద్రబాబు ఇమేజ్ ని పెంచే విధంగా వుంది తప్ప, ఎన్టీఆర్ బయోపిక్ లా లేదని టాక్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుని విలన్ గా చూపించారని టాక్ వినిపిస్తుంది.

ట్రైలర్ లో కూడా కొన్ని డైలాగ్స్ పరంగా నాదెండ్ల విలన్ అనే విధంగానే అనిపిస్తుంది.ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమాలో తనని నెగిటివ్ గా రిప్రజెంట్ చేయడంపై నాదెండ్ల భాస్కరరావు స్పందించారు.

మహానాయకుడు సినిమాలో తనని విలన్ గా ప్రాజెక్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు నాదెండ్ల భాస్కరరావు మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.తెలుగు దేశం పార్టీని తాను స్థాపించి ఎన్టీఆర్ చేతులో పెట్టా అని, అయితే మహానాయకుడు సినిమాలో చాలా విషయాలు వక్రీకరించి తన ఇమేజ్ డామేజ్ చేసారని, తనని విలన్ గా చూపించి తన గౌరవానికి భాగం కలిగించారని నాదెండ్ల చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక ఈ సినిమాపై ఇప్పటికే దర్శకుడు, నిర్మాతకి నోటీసులు పంపించా అని, అయితే ప్రభుత్వం వాళ్ళ చేతులో వుండటం వలన తన షోకాజ్ నోటీసులని పరిగణంలోకి తీసుకోలేదని నాదెండ్ల వాఖ్యలు చేసారు.ఇక ఈ సినిమా చూసిన తర్వాత తన పాత్రని తప్పుగా చూపించినట్లు అనిపిస్తే పరువునష్టం దావా వేయడానికి సిద్ధం అవుతానని నాదెండ్ల మీడియాతో తెలియజేసారు.

ఈ నేపధ్యంలో మహానాయకుడు సినిమా యూనిట్ నాదెండ్ల వాఖ్యలపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు