మౌని రాయ్( Mouni Roy ) పరిచయం అవసరం లేని పేరు హిందీ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే.తెలుగులో నాగిని ( Nagini ) సీరియల్స్ ద్వారా ఇంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మౌని రాయ్ ఒకవైపు సీరియల్స్ నటిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈమె పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే మౌని రాయ్ ఆస్తుల గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది.

2006లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే టీవీ సిరీస్‌తో సినీరంగ ప్రవేశం చేసినటువంటి ఈమె అనంతరం నాగిని సీరియల్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా సినిమాలపరంగా కెరియర్లో ఎంతో బిజీగా ఉన్నటువంటి మౌనీ రాయ్ నికర విలువ, ఆస్తి వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.ఇటీవలి నివేదిక ప్రకారం, మౌని రాయ్ నికర విలువ దాదాపు రూ.41 కోట్లు( Mouni Roy Net worth ) ఉన్నట్లు తెలుస్తోంది.ఈమె సినిమాలలో నటిస్తూనే మరోవైపు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఈ విధంగా సినిమాలలో, సీరియల్స్ లో కొనసాగుతూనే భారీగా ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది.ఇక ఈమె ఒక మ్యూజిక్ ఈవెంట్లో కనుక సందడి చేస్తే సుమారు 50 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు రెమ్యూనరేషన్( Mouni Roy Remuneration ) అందుకుంటారట.అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్, లాక్మే, ఫెయిర్ల వ్లీతో సహా పలు ప్రముఖ బ్రాండ్‌లకు మౌని రాయ్ ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్.
ప్రతి ఎండార్స్‌మెంట్ డీల్‌కు ఆమె దాదాపు 10 లక్షల రూపాయల వరకు కమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది.







