మనదేశంలో పెళ్లిళ్లు, జాతరలు, దేవుడి ఊరేగింపుల సమయంలో సన్నాయి, డప్పులు వాయిద్యాలను( Drums ) ప్రధానంగా వాడుతూ వుంటారు.ఎందుకంటే అవి మన సంప్రదాయాలలో ఒక భాగం కనుక.
ఇక పెళ్లి ఊరేగింపులో డోలు సన్నాయి రాగయుక్తంగా వాయిస్తుంటే ఆహుతులతో పాటు.వధూవరులు తన్మయత్వంలో డ్యాన్స్ చేయడం మనం చూస్తూ వుంటాం.
అదే సమయంలో డోలు, సన్నాయి, డ్రమ్స్ వాయించే వాయిద్య కళాకారుల ప్రతిభను మెచ్చి కొందరు డబ్బులు గిఫ్ట్ గా ఇవ్వడం మనం అప్పుడప్పుడు చూస్తూ వుంటాం.

కాగా ఇప్పుడు డిజిటల్ యుగం( Digital ) మొదలైంది.సర్వసాధారణంగా ప్రజల చేతిలో డబ్బులు అనేవి ఉండడం లేదు.అందుకనే తమకు ఇవ్వాలని ఉన్నా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి దాదాపుగా నెలకొన్న పరిస్తితులలో ఒక డోలు వాయిస్తున్న వాయిద్య కళాకారుడు( Drummer ) డిజిటల్ కాలంలో ఉన్నట్లుగానే ఆలోచించాడు.
తన ప్రతిభ నచ్చి మెచ్చి ఎవరైనా బహుమానం ఇవ్వాలనుకుంటే వారి కోసం ఓ ఆలోచన చేశాడు.అందుకు తగిన ఏర్పాటు చేసాడు కూడా.దాంతో ఆ కళాకారుడు తెలివిని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు.

విషయం ఏమిటంటే డ్రమ్మర్ తన డ్రమ్ మీద తన మొబైల్‌లో క్యూఆర్ కోడ్ ని( QR Code ) ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాడు.ఎవరైనా వేడుక సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే డ్రమ్‌పై అమర్చిన ఉన్న క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి అతనికి డబ్బులు ఇవ్వచ్చున్నమాట.ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ xలో షేర్ చేయగా ఈ ఫోటో పలువురిని ఆకట్టుకుంది.
తమ అభిప్రాయాన్ని భిన్నమైన పద్ధతుల్లో తెలియజేస్తున్నారు.భయ్యా! నీ తెలివి అద్భుతం.
ఇప్పుడు డబ్బు నేరుగా నీఖాతాలోకి వెళ్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.కావాలంటే మీరు కూడా ఆ చిత్రాన్ని చూసి మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయొచ్చు.







