ఆ అడవిలో ఆత్మలు.. బాధలలో ఉన్నవారంతా అక్కడకు వెళ్లి..

ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి.అవి చాలా ర‌హ‌స్యాతో ముడిప‌డి ఉన్నాయి.

 Mystery Of Aokigahara Suicide Forest Japan , Japan , Suicide Forest Japan , Ao-TeluguStop.com

ప్రపంచంలో అనేక హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి.ఇవి చర్చనీయాంశంగా మారాయి.

అలాంటి ప్రదేశం జపాన్‌లో కూడా ఉంది.ఈ ప్రదేశాన్ని సూసైడ్ ఫారెస్ట్ అని అంటారు.

ఈ అడవి చూడటానికి ఎంత అందంగా ఉంటుంతో అంతే ప్రమాదకరం అని అంటారు.ఇది భయానక కథనాల‌ కారణంగా ఎంతో ప్రజాదరణ పొందింది.

అడవిలో ఆత్మలు నివసిస్తాయని, ఇక్కడికి వచ్చేవారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటార‌ని చెబుతుంటారు.ఈ అడవిలో ఇప్పటివరకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇక్కడ దెయ్యాలు ఉంటాయని ఇక్క‌డివారిలో ఒక నమ్మకం ఉంది.ఈ దెయ్యాలు ఇక్కడికి వచ్చే వారిని బలవంతంగా ఆత్మహత్యలకు పురిగొల్పుతాయ‌ట‌.

ఈ అడవి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆత్మహత్య ప్రదేశాలలో రెండవ స్థానంలో ఉంది.ఈ ప్రమాదకరమైన అడవి జపాన్ రాజధాని టోక్యోకు స‌మీపంలో ఉంది.

ఈ అడవిని జ‌పాన్‌లో ఓకిగహారా అడవి అంటారు.

ఈ అడవిలోకి ప్రవేశించేటప్పుడు చాలా హెచ్చరికలు క‌నిపిస్తాయి.

అందులో మీ పిల్లలు, కుటుంబం గురించి ఒక‌సారి ఆలోచించండి అని రాసి ఉంటుంది.అలాగే మీ జీవితం మీ తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన బహుమతి.

అని కూడా రాసివుంటుంది.టోక్యో నుంచి 2 గంటల దూరంలో ఫుజి పర్వతానికి వాయువ్యంలో ఉన్న ఈ అడవి 35 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది.

ఇక్కడ నుండి బయటకు రావడం చాలా కష్టం.ఈ అడవిలో ఆత్మలు నివసిస్తాయని స్థానికులు నమ్ముతారు.

అధికారిక రికార్డుల ప్రకారం, ఈ అడవిలో సుమారు 105 మృతదేహాలు కనుగొన్నారు.ఈ అడవిలో మొబైల్ ఫోన్‌ పని చేయదు.

దీంతో అడవిలో చిక్కుకున్న వారికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది.రాత్రిపూట అడవి నుంచి అరుపుల శబ్దాలు వస్తాయని అడవికి సమీపంలో నివసించే వారు చెబుతున్నారు.

ఈ అడవిలో 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన వివిధ జాతుల చెట్లు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube