అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ ప్రమాదం నుంచీ త్రుటిలో తప్పించుకున్నారు.ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా పెను ప్రమాదం జరిగే ముందుగానే పైలెట్ తన చాకచక్యంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారని తాజాగా వెలుగులోకి వచ్చింది.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘన ప్రస్తుతం వైరల్ అవడంతో ట్రంప్ అభిమానులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ అసలేం జరిగింది.
అమెరికాలోని న్యూ ఒర్లియాన్స్ లో గడిచిన శనివారం రోజున రిపబ్లికన్ నేషనల్ కీలక సమావేశానికి ట్రంప్ హాజరయ్యారు.అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొన్న ట్రంప్ సమావేశం ముగించుకుని తిరిగి ఫ్లోరిడా లో ఉన్న తన ఎస్టేట్ కి తిరిగి వెళ్తున్న క్రమంలో విమానంలో సాంకేతిక లోపం కలిగినట్టుగా పైలెట్ గుర్తించారు.
వెంటంటే ఈ విషయాన్నీ సంభందిత వర్గాలకు అందించి విమానాని అత్యవసర ల్యాండ్ చేస్తున్నట్టుగా భద్రతా సిబ్బందికి వెల్లడించారు.దాంతో వారి అనుమతుల మేరకు పైలెట్ మెక్సికో గగనతలం మీదుగా వెళ్తూనే అత్యవసర ల్యాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

సమావేశం ముగించుకుని మెక్సికో గగనతలం మీదుగా వెళ్తున్న క్రమంలో ఒక్క సారిగా విమాన ఇంజన్ లో సాంకేతిక లోపం కలిగిందని, వెంటనే ఇంజన్ ఆగిపోయిందని, ఈ ఘటన సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిందని పైలెట్ తెలిపాడు.ఇంజన్ లో సమస్య వచ్చినపుడు విమానం సుమారు 120 కిలోమీటర్ల గగనతలంలో ఉందని, ఆసమయంలో జరగరానిది జరిగితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని అంటున్నారు నిపుణులు.ఇదిలాఉంటే ఈ ఘటన సమయంలో ట్రంప్ తో పాటు ఆయన భద్రతా సిబ్బంది, అలాగే ట్రంప్ సలహా దారు, మరి కొందరు నిఘా అధికారులు ఆయనతో పాటు ఉన్నారని తెలుస్తోంది.ఈ ఘటన జరిగి సుమారు వారం కావస్తోందని కానీ భద్రతా కారణాల వలెనే ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది బయట పెట్టలేదని ఓ వార్తా కధనం రాసుకొచ్చింది.








