ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి.అవి చాలా రహస్యాతో ముడిపడి ఉన్నాయి.
ప్రపంచంలో అనేక హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి.ఇవి చర్చనీయాంశంగా మారాయి.
అలాంటి ప్రదేశం జపాన్లో కూడా ఉంది.ఈ ప్రదేశాన్ని సూసైడ్ ఫారెస్ట్ అని అంటారు.
ఈ అడవి చూడటానికి ఎంత అందంగా ఉంటుంతో అంతే ప్రమాదకరం అని అంటారు.ఇది భయానక కథనాల కారణంగా ఎంతో ప్రజాదరణ పొందింది.
ఈ అడవిలో ఆత్మలు నివసిస్తాయని, ఇక్కడికి వచ్చేవారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని చెబుతుంటారు.ఈ అడవిలో ఇప్పటివరకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇక్కడ దెయ్యాలు ఉంటాయని ఇక్కడివారిలో ఒక నమ్మకం ఉంది.ఈ దెయ్యాలు ఇక్కడికి వచ్చే వారిని బలవంతంగా ఆత్మహత్యలకు పురిగొల్పుతాయట.
ఈ అడవి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆత్మహత్య ప్రదేశాలలో రెండవ స్థానంలో ఉంది.ఈ ప్రమాదకరమైన అడవి జపాన్ రాజధాని టోక్యోకు సమీపంలో ఉంది.
ఈ అడవిని జపాన్లో ఓకిగహారా అడవి అంటారు.
ఈ అడవిలోకి ప్రవేశించేటప్పుడు చాలా హెచ్చరికలు కనిపిస్తాయి.
అందులో మీ పిల్లలు, కుటుంబం గురించి ఒకసారి ఆలోచించండి అని రాసి ఉంటుంది.అలాగే మీ జీవితం మీ తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన బహుమతి.
అని కూడా రాసివుంటుంది.టోక్యో నుంచి 2 గంటల దూరంలో ఫుజి పర్వతానికి వాయువ్యంలో ఉన్న ఈ అడవి 35 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది.
ఇక్కడ నుండి బయటకు రావడం చాలా కష్టం.ఈ అడవిలో ఆత్మలు నివసిస్తాయని స్థానికులు నమ్ముతారు.
అధికారిక రికార్డుల ప్రకారం, ఈ అడవిలో సుమారు 105 మృతదేహాలు కనుగొన్నారు.ఈ అడవిలో మొబైల్ ఫోన్ పని చేయదు.
దీంతో అడవిలో చిక్కుకున్న వారికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది.రాత్రిపూట అడవి నుంచి అరుపుల శబ్దాలు వస్తాయని అడవికి సమీపంలో నివసించే వారు చెబుతున్నారు.
ఈ అడవిలో 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన వివిధ జాతుల చెట్లు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు.







