Jr Ntr Naga Shaurya : నాగశౌర్య రెస్టారెంట్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య( Naga Shaurya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగశౌర్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Mutton Biryani For Ntr From Naga Shaurya Restaurant-TeluguStop.com

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు నాగశౌర్య.కాగా గత ఏడాది అనుష్క అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే వీరి పెళ్లి అయ్యి ఏడాది పూర్తవడంతో మొదటి వెడ్డింగ్ యానివర్సరీ ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు నాగ శౌర్య దంపతులు.

Telugu Mutton Biryani, Naga Shaurya, Restaurant, Tollywood, Usha Mulpuri-Movie

నాగ శౌర్య తల్లి విషయానికి వస్తే తల్లి ఉష నిర్మాతగానే కాకుండా ఇటీవలే ఫుడ్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టింది.కాగా నాగశౌర్య తల్లి ఉష నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరించిన విషయం తెలిసిందే.చాలా వరకు కొడుకు నాగశౌర్య సినిమాలకు ఆమెనే నిర్మాతగా వ్యవహరించారు.

ఇది ఇలా ఉంటే ఉషా మూలపూరి హైదరాబాదులో సరికొత్తగా రెస్టారెంట్ బిజినెస్ ని కూడా మొదలుపెట్టారు.ఉష మూలపూరి కిచెన్ పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది.

దీంతో పలు యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్ ఉష మూలపూరి కిచెన్ ని విజిట్ చేసి ఉష( Usha ) ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వైరల్లీ పుడ్ ఇంటర్వ్యూ తర్వాత మా బిజినెస్ బాగా పెరిగింది.

Telugu Mutton Biryani, Naga Shaurya, Restaurant, Tollywood, Usha Mulpuri-Movie

ఈ రెస్టారెంట్ మొదలు పెట్టి నెలన్నర గడిచింది, వైరల్లీ ఫుడ్ వచ్చాక మాకు ఖాళీ లేదు.మా రెస్టరెంట్ కి బాగా డిమాండ్ పెరిగింది.పలువురు సెలెబ్రిటీస్ ఈ రెస్టారెంట్ కి వస్తున్నారు.నిన్ననే జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కి మా రెస్టారెంట్ నుంచి పార్సిల్ వెళ్ళింది అని ఉషగారు చెప్పారు.

అవునా ఎన్టీఆర్ కి పంపిన ఆ ఫుడ్ ఏమిటి అని సదరు యాంకర్ అడగగా ఎన్టీఆర్ గారికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం, అదే ఆర్డర్ పెట్టగా ఆయన డ్రైవర్ వచ్చి పార్సిల్ తీసుకుని వెళ్ళినట్టుగా ఉష తెలిపారు.ఇంకా చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారని, తాము కిచెన్ ని చాలా నీట్ గా, ఇంట్లో ఉన్నట్లుగానే మైంటైన్ చేస్తున్నామని, ప్రస్తుతం అర క్షణం ఖాళీ లేదు.

మేడ్స్ ని, వంట మాస్టర్స్ ని గైడ్ చేస్తున్నట్టుగా ఉష మూలపూరి యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube