ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్( Elon Musk ) తాజాగా తన బ్రెయిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన మెదడు ఒక తుఫాన్ లాగా చాలా ఆలోచనలతో చాలా నాయిసీగా ఉంటుందన్నారు.
ఈ ఆలోచనలను తొలగించి బ్రెయిన్‌ను ప్రశాంతంగా ఉంచుకోవడానికి తాను వీడియో గేమ్‌లు ఆడటానికి బాగా ఇష్టపడతానని అన్నారు.వాటితో తన చంచలమైన మెదడుకు విశ్రాంతిని అందిస్తానని పేర్కొన్నారు.
అతను రీసెంట్ ఎపిసోడ్‌లో పోడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్( Lex Fridman )తో గేమింగ్ గురించి తన ఆలోచనలను పంచుకున్నారు.

టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ వంటి ప్రముఖ కంపెనీల సవాళ్లను ఎదుర్కోవడానికి వీడియో గేమ్‌లు తనకు సహాయపడతాయని మస్క్ చెప్పారు.చాలా వీడియో గేమ్‌లు ఆడుతానని, ఎందుకంటే అవి తన మెయిన్ హాబీ అని వెల్లడించారు.అయితే, మస్క్ గేమింగ్‌ను ఎప్పుడూ కూడా సరదాగా తీసుకోరు.
ఏ గేమ్ ఆడినా చాలా సీరియస్ గా ఆడతారు.అందులోని ఛాలెంజ్‌లను అధిగమించడానికి తన ఫుల్ బ్రెయిన్ పవర్ ఉపయోగిస్తారు.
మస్క్‌కి ఇష్టమైన వీడియో గేమ్‌లలో “ది బాటిల్ ఆఫ్ పాలిటోపియా” ఒకటి.ఇదొక వ్యూహాత్మక గేమ్.
మరొకటి “ఎల్డెన్ రింగ్( Elden Ring )”, ఇది శత్రువులను జయించడం, అంతర్గత గందరగోళాన్ని అధిగమించడం గురించి ఫాంటసీ గేమ్.మస్క్ ఈ గేమ్స్ చాలా క్రియేటివ్ ఆర్టిస్టిక్‌గా ఉన్నాయని , అందుకే తనకు బాగా నచ్చాయని అన్నారు.

ఆసక్తికరంగా, మస్క్ గేమింగ్ అతని కొన్ని వ్యాపార నిర్ణయాలను కూడా ప్రభావితం చేసింది.తెల్లవారుజాము వరకు ఎల్డెన్ రింగ్ ఆడిన తర్వాత మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒకరు వెల్లడించారు.ఆప్టిమల్ ఫోకస్, ఆనందాన్ని పొందడానికి వీడియో గేమ్‌లు ఆడతాడని మస్క్ వివరించారు.చాలా ఈజీ లేదా చాలా డిఫికల్ట్ ఆటలను తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.పజిల్స్, స్టోరీస్, వీడియో గేమ్‌ల కళను ఆస్వాదిస్తానని కూడా చెప్పారు.