దీపావళి పండుగను భారతదేశవ్యాప్తంగా హిందువులు చాలా గొప్పగా జరుపుకున్నారు.ఇళ్లను రంగురంగుల లైట్లతో అలంకరించి ఈ దీపాల పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
కానీ పేదవారు ఈ చలిలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకోవాల్సి వచ్చింది.బాంబుల శబ్దాలతో వారు భయపడుతూ రోడ్లపై పడుకోవాల్సిన దుస్థితి పట్టింది.
అయితే ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియాకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్( Rahmanullah Gurbaz ) ఒక మంచి పని చేసి క్రికెట్ లవర్స్ మనసులను గెలుచుకుంటున్నాడు.

గుర్బాజ్ అహ్మదాబాద్ వీధుల్లో ( Ahmedabad )అర్థరాత్రి పేదలకు డబ్బు పంచాడు.2023 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘన్ టీమ్ సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది, కానీ ఆ టీమ్ ప్లేయర్ మంచి పని చేసి భారత క్రికెట్ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు.ప్రపంచ కప్ రేస్ నుంచి ఔట్ అయిన ఆఫ్ఘన్ జట్టు తిరిగి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధమవుతోంది, కానీ అంతకు ముందు, ఆఫ్ఘన్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ దీపావళి సందర్భంగా అర్థరాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రించే నిరుపేదలకు డబ్బు, దీపావళి కానుకలు ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
దీని కారణంగా మన ఇండియన్స్( Indians ) మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అతనిని పొగుడుతున్నారు.

రహమానుల్లా గుర్బాజ్ తన కారులో వెళుతున్నప్పుడు, రోడ్లపై నిద్రిస్తున్న కొంతమంది నిరుపేదలను చూశాడు.వారిని చూసిన గుర్బాజ్ తన కారులోంచి బయటకు వచ్చి దీపావళి సందర్భంగా అందరికీ తన వద్ద 500 రూపాయల నోట్లను పెంచి పెట్టాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







