ప్రభాస్ మైనపు విగ్రహంపై స్పందించి క్లారిటీ ఇచ్చిన మ్యూజియం నిర్వాహకులు.. ఏమన్నారంటే?

మైసూర్‌లోని ఓ మ్యూజియంలో ప్రభాస్‌ ( Prabahs ) మైనపు విగ్రహం కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది.

బాహుబలిలోని అమరేంద్ర బాహుబలి దారుణలో ఉన్నటువంటి ప్రభాస్ మైనపు విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విగ్రహంపై ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నిజంగానే ప్రభాస్ ను అవమానించినట్లేనని ఫాన్స్ ఫైర్ అయ్యారు.అయితే ఈ విగ్రహంపై బాహుబలి నిర్మాత శోభయార్లగడ్డ ( Sobhu Yarlagadda ) కూడా తీవస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి లైసెన్స్ తీసుకోలేదు ఈ విగ్రహాన్ని వెంటనే తొలగించకపోతే చర్యలు చేపడతామంటూ ఈయన వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని( A wax statue ) ఏర్పాటు చేయడం గురించి మ్యూజియం నిర్వాహకులు స్పందించారు.ఈ సందర్భంగా మ్యూజియం నిర్వహకులు మాట్లాడుతూ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని మేము ఇలా చేయలేదు.కానీ ఈ విగ్రహంపై చిత్ర నిర్మాత నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

అందుకే ఈ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నాను.ఇలా నిర్వాహకులు ఈ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో వీరిపై భారీ స్థాయిలో వస్తున్నటువంటి ట్రోల్స్ అన్నీ కూడా ఆగిపోయాయి.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరో అలాంటి హీరో విగ్రహాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కనీస బాధ్యత కూడా లేకుండా ఇష్టానుసారంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా నిర్మాత కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఈ విగ్రహాన్ని తొలగించినట్లు తెలుస్తోంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన త్వరలోనే సలార్ సినిమా( Salaar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిందని చెప్పాలి ఈ సినిమాలతో పాటు కల్కి అలాగే మారుతి డైరెక్షన్లో కూడా ఈయన మరొక సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు