మరోసారి కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన థమన్..'గుంటూరు కారం' టీజర్ మ్యూజిక్ ఎక్కడి నుండి కొట్టేశాడో తెలుసా!

సౌత్ లో ఇప్పుడు టాప్ లీడింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో థమన్ కచ్చితంగా ఉంటాడు.మీడియం రేంజ్ హీరో దగ్గర నుండి స్టార్ హీరో వరకు ప్రతీ ఒక్కరికీ ఇప్పుడు థమన్ కావాలి.

 Music Director Thaman Copied Tune From Krk Movie For Guntur Karam Movie,mahesh B-TeluguStop.com

పాపం ఒత్తిడి చాలా తీవ్రంగా పెరిగిందో ఏమో తెలియదు కానీ, ఈమధ్య ఆయన మ్యూజిక్ ఇచ్చిన కాపీ ట్యూన్స్ అంటూ దొరికిపోతున్నాడు.ఈరోజు విడుదలైన ‘గుంటూరు కారం'( Guntur Karam ) చిత్రం టీజర్ విషయం లో కూడా అదే జరిగింది.

ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా యావరేజి గా ఉందని, ఆ ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే నాలుగైదు సినిమాల నుండి కాపీ కొట్టినట్టు అనిపించిందని, ఇది వరకు ఆయన పక్క సినిమాల ట్యూన్స్ కాపీ కొట్టేవాడని, కానీ ఇప్పుడు తన సినిమాల్లోని ట్యూన్స్ ని తనే కాపీ కొట్టాడు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ విపరీతంగా పడుతున్నాయి.

ఈ టీజర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్( Background Music ) విన్న తర్వాత ‘అలా వైకుంఠపురం లో ‘ చిత్రంలోని క్లైమాక్స్ లో వచ్చే ‘సిత్తరాల సిరపడు’ అనే సాంగ్ గుర్తుకు వస్తుంది.అందులో నుండి థమన్( Music Director Thaman ) కాపీ కొట్టినట్టుగా సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అంతే కాదు రీసెంట్ గా విడుదలైన రామ్ – బోయపాటి మూవీ టీజర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ‘గుంటూరు కారం’ చిత్రం టీజర్ వీడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పోలి ఉందని చెప్తున్నారు.

మరి కొంతమంది అయితే తమిళం లో గత ఏడాది విజయ్ సేతు పతి , సమంత మరియు నయనతార కాంబినేషన్ లో వచ్చిన KRK చిత్రం లోని ఒక పాటలో ఉన్న ట్యూన్ ని కాపీ కొట్టాడని అంటున్నారు.ఇలా ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇన్ని ట్యూన్స్ నుండి కాపీ కొట్టాడా అంటూ థమన్ పై విపరీతమైన ట్రోల్ల్స్ వినిపిస్తున్నాయి.

మరోపక్క మహేష్ బాబు ఫ్యాన్స్( Mahesh Babu Fans ) కూడా మాకు కాపీ ట్యూన్ కొడుతావా, పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే ప్రాణం పెట్టేస్తావు, మా సినిమాలకు ఎందుకు అలాంటి మ్యూజిక్ ని ఇస్తున్నావు అంటూ తిడుతున్నారు.వాళ్ళు చెప్పినట్టు గానే పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలకు థమన్ అందించిన మ్యూజిక్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.రీసెంట్ గా విడుదల చేసిన ‘బ్రో'( Bro Movie ) మూవీ మోషన్ పోస్టర్ కి కూడా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.అంతే కాదు #OG మూవీ షూటింగ్ వీడియో కి కూడా అదిరిపోయే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇది వరకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం నిజాయితీగా అందించాడు.కానీ మహేష్ బాబు కి మాత్రం అన్యాయం చేస్తున్నాడు అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube