ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస అవకాశాలను అందుకుంటున్న వారిలో ఎస్ఎస్ తమన్ ఒకరు.ఈయన ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం సుమారు అరుడజనకు పైగా సినిమాలను చేతిలో పెట్టుకున్నారు.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి తమన్ తాజాగా వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో ప్రతి ఒక్క పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
గతంలో అఖండ సినిమా కోసం అందించిన సంగీతానికి ఏకంగా స్పీకర్లు పగిలిపోయిన సంగతి మనకు తెలిసిందే.అయితే అంతే ఎనర్జీతో మరోసారి వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్ బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ.బాలయ్యను అభిమానులు 70MMలో చూడాలని కోరుకుంటారు.

నిజానికి ఆయనే 70MM.ఆయన సినిమాలకు మ్యూజిక్ అందించాలంటే మా కీబోర్డ్ లు సరిపోవడం లేదు అంటూ తమన్ ఈ సందర్భంగా బాలయ్య సినిమాల గురించి వెల్లడించారు.బాలయ్య బాబు మా సంగీతాన్ని ఒక మ్యాగ్నెట్ లా ఆకట్టుకుంటారు.
ఆయన నటన మాకు ఎంతో ఎనర్జీని అందిస్తుంది అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమాల గురించి తమన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







