ప్రభాస్ - హను రాఘవపూడి ప్రాజెక్ట్ కు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) బాహుబలి సిరీస్ తో బాగా పాపులర్ అయ్యి పాన్ ఇండియన్ వ్యాప్తంగా తన మార్కెట్ ను కూడా విస్తరించుకున్నాడు.అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్ళీ మరో హిట్ అందుకోలేకపోయాడు.

 Music Director Locked For Prabhas Director Hanu Raghavapudi Movie, Prabhas, T-TeluguStop.com

అయినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడుఒక సినిమా పూర్తి కాగానే మరో సినిమాను రిలీజ్ చేస్తూ ఒకే సమయంలో రెండు మూడు సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు డార్లింగ్.ఇక ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మరో సినిమాను తీసుకు రానున్నాడు.

ప్రభాస్ నటించిన ‘సలార్’ ( Salaar ) డిసెంబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇక దీంతో పాటు డార్లింగ్ చేతిలో కల్కి ( Kalki 2898 AD ) సినిమా అలాగే మారుతి సినిమా కూడా ఉన్నాయి.ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే ప్రభాస్ హను రాఘవపూడితో కూడా ఒక మూవీ ఒప్పుకున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.మరి ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయ్యింది.

సీతారామం అనే బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా వచ్చే వేసవి నుండి షూట్ స్టార్ట్ కానున్నట్టు సమాచారం.తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.హను సినిమాల్లో వర్క్ చేసే విశాల్ చంద్రశేఖర్ ( Vishal Chandrashekhar )నే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నట్టు టాక్.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube