లాభాల పూలు పూయిస్తున్న పుట్టగొడుగులు

భారతదేశంలోని రైతులు లాభ‌దాయ‌క పంట‌ల‌పై మ‌రింత‌గా అవగాహన పెంచుకుంటున్నారు.సంప్రదాయ పంటలే కాకుండా కొత్త పంటల ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు.

 Mushroom Farming Profit 40 Lakhs Per Month , Mushroom Farming , Profit 40 Lakhs-TeluguStop.com

యువత కూడా పెద్ద సంఖ్యలో వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. హర్యానాలోని హిసార్ జిల్లా సేలంఘర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల వికాస్ వర్మ 45×130 అడుగుల విస్తీర్ణంలో పుట్టగొడుగులను సాగు చేస్తున్నాడు.దీంతో ఏటా 30 నుంచి 40 లక్షల వరకు లాభం పొందుతున్నాడు.2016లో 12వ తరగతి ఫెయిలయ్యాక మళ్లీ చదువుకోవాలని అనుకోలేదని వికాస్ చెప్పాడు.కుటుంబంలోని వ్యక్తులు అప్ప‌టికే వ్యవసాయం చేసేవారు కాబట్టి దానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు తెలుసుకున్న‌న‌న్నాడు.భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వ్యవసాయం మొద‌లు పెట్టాన‌ని తెలిపాడు.

24 సంవత్సరాల వయస్సులో పుట్టగొడుగుల ఉత్పత్తితో పాటు, నాకు “వేదాంత మష్రూమ్” అనే ఆగ్రో కంపెనీ ఏర్పాటు చేశాన‌న్నాడు.వీటి టర్నోవర్ దాదాపు 70 లక్షలకు చేరుకుంది.

పుట్టగొడుగులను ప్రాసెస్ చేయడం ద్వారా బిస్కెట్లు, డ్రింక్స్, చిప్స్ వంటి ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించానని వికాస్ తెలిపాడు.మార్కెట్‌లో విక్రయించడం కూడా అత‌నికి ఈజీ అయ్యింది.గతంలో కిలో రూ.700లకు విక్రయించే మష్రూమ్ ఇప్పుడు అదే కిలో పుట్టగొడుగును ప్రాసెస్ చేయడంతో దాదాపు రూ.8000 పలుకుతోంది.ఇందులో 6000 వేల వరకు లాభం వస్తుంద‌ని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube