Srinivas Goud : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముందు ముసళ్ల పండగే..: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని చెప్పారు.

పాలమూరులో అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు.

కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చిందన్న ఆయన తెలంగాణ రావడం వలనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముందు ముసళ్ల పండగేనని చెప్పారు.

రెండు జాతీయ పార్టీలకే పొత్తు అవసరమన్నారు.పాలమూరులో కాంగ్రెస్, బీజేపీ( Congress , BJP ) ఒక్కటై పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.తమకు పొత్తు అవసరం లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisement
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు