తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.తెలంగాణ రాక ముందు ఉన్నంతలా కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
అయితే రేవంత్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సీనియర్ నేతల మధ్య ఐక్యత లేకపోవడం అనేది కాంగ్రెస్ ను ప్రజల్లో బలమైన పార్టీగా నిలబడేందుకు అడ్డుకట్టగా మారిందని చెప్పవచ్చు.ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మిగిలి ఉన్న తరుణంలో రాబోయే కాలం మొత్తం చాలా కీలకంగా మారిన తరుణంలో సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం అన్నది కొంత కాంగ్రెస్ కు ప్రమాద ఘంటికలు మోగిస్తునట్టుగా మనం చెప్పుకోవచ్చు.
ఇక అసలు విషయంలోకి వస్తే నిన్న అసెంబ్లీలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య వ్యాఖ్యల వార్ జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఈ క్రమంలో మంత్రి తలసానిని రాజగోపాల్ రెడ్డి పేకాట అడుతాడని అనడం, మంత్రి తలసాని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కాంట్రాక్టర్ అని అన్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
అయితే ఈ సందర్భంలో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇటు రాజగోపాల్ రెడ్డి మంత్రి తలసానిని పేకాట ఆడుతాడని అని ఉండకుండా ఉండాల్సిందని, మంత్రి తలసాని కాంట్రాక్టర్ అని ఉండకుండా ఉండాల్సిందని ఇద్దరిదీ తప్పేనని భట్టి విక్రమార్క అన్నారు.అయితే నేడు మీడియా చిట్ చాట్ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భట్టి వ్యాఖ్యలపై స్పందిస్తూ భట్టి ఇంకాస్త గట్టిగా మాట్లాడితే బాగుండేదని కాని అలా జరగకపోవడం కాస్త బాధించిందని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే పార్టీకి పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసే పోతానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.