ఆయన్ను అల వైకుంఠపురములో బాధ పెట్టిందట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.కాగా ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చిత్ర యూనిట్ వైజాగ్‌లో సక్సె్స్ మీట్ కూడా నిర్వహించారు.

అయితే ఈ సినిమాలో నటించిన మురళీ శర్మ మాత్రం సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు.దీనికి ఓ బలమైన కారణమే ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాలో మురళీ శర్మ బన్నీ తండ్రిగా నటించిన సంగతి తెలిసిందే.అయితే రోజూవారి రెమ్యునరేషన్ తీసుకునే మురళీ శర్మకు అల వైకుంఠపురములో సినిమాకు 50 రోజులకు పారితోషకం ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

Advertisement

కానీ 50 రోజులకు బదలుగా 70 రోజులు షూటింగ్ నిర్వహించారు.దీంతో ఆయన 70 రోజుల పేమెంట్ అడగగా కేవలం 50 రోజుల పేమెంట్ మాత్రమే ఇచ్చారట చిత్ర నిర్మాతలు.

దీంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు.అంతేగాక సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా ఆయన మనకు కనిపించలేదు.

ఈ సినిమాలో బన్నీ తరువాత అంత పేరు సంపాదించిన పాత్ర ఖచ్చితంగా మురళీ శర్మదే అని చెప్పాలి.మరి ఇలాంటి ఆర్టిస్టును పక్కకు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటున్నారు ఈ విషయం తెలిసినవారు.

ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!
Advertisement

తాజా వార్తలు