వైఎస్ రాజశేఖర్ రెడ్డి మురళీ మోహన్ ను అంత దారుణంగా అవమానించారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నేత అయిన మురళీ మోహన్( Murali mohan ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మురళీ మోహన్ నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

 Murali Mohan Shocking Comments About Ysr Details Here Goes Viral In Social Med-TeluguStop.com

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Y.S.Rajasekhara Reddy ) ఒక సందర్భంలో తనను అవమానించారని ఆయన కామెంట్లు చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కావాలని చాలామందిని అడిగామని ఆయన తెలిపారు.

చాలామంది చూద్దాం చేద్దాం అని చెప్పారే తప్ప చేయలేదని మురళీ మోహన్ కామెంట్లు చేశారు.పద్మాలయ, రామానాయుడు స్టూడియో( Ramanaidu Studio )స్ మధ్యలో ఉన్న 14 ఎకరాలలో ఒక ఎకరం కావాలని మేము కోరామని వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఒకరోజు అందరం కలిసి ఆయనను కలవడానికి వెళ్లామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

మేము వైఎస్సార్ ను కలవగా ఆయన ఎగతాళిగా మాట్లాడారని ఆయన తెలిపారు.

ఏమయ్యా.మీరంతా సినిమా వాళ్లు ఎకరం స్థలం కావాలని వచ్చారని మీ అందరికీ కావాల్సిన స్థలం ఇచ్చే కెపాసిటీ మురళీ మోహన్ కు ఉందని వైఎస్సార్ అన్నారని మురళీ మోహన్ పేర్కొన్నారు.జోక్ లాగా అందరూ నవ్వారని నెక్స్ట్ డే పేపర్ లో కూడా అదే వచ్చిందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో మూడు కోట్ల రూపాయలు ఉండేవని ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీతో ఆ సమయంలో ఆఫీస్ ను నిర్వహించామని మురళీ మోహన్ అన్నారు.

మురళీ మోహన్ టీడీపీకి చెందిన నేత కావడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఆ విధంగా మాట్లాడటం జరిగిందని తెలుస్తోంది.మురళీ మోహన్ ప్రస్తుతం సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నారు.మురళీ మోహన్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube