మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఉదయం 9 గంటల నుంచి గంట సమయంలో 11.2 శాతం పోలింగ్ నమోదైంది.ఈ క్రమంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.కాగా మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఉపఎన్నిక బరిలో 47మంది అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే.మరోవైపు మునుగోడు జెడ్పీ స్కూల్ లో జరుగుతున్న పోలింగ్ ను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.
అటు చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు వేశారు.అదేవిధంగా నారాయణపురం మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.