ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ముంబై వర్సెస్ బెంగళూరు టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీమ్ ఘనవిజయం సాధించింది.అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచినప్పటికీ, ముంబై బ్యాట్స్ మెన్స్ లని ఎదుర్కోవడంలో బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్ లో పటిదర్( Patidar ) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక అతనికి తోడుగా దినేష్ కార్తీక్ కూడా చివర్లో మెరుపులు మెరిపించి తను కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.

దాంతో బెంగళూరు టీమ్ భారీ స్కర్ అయితే చేయగలిగింది.ఒక పక్క బెంగళూరు భారీ స్కోరు చేసినప్పటికీ ముంబై బౌలర్ అయిన బుమ్ర( Bumrah ) 5 వికెట్లు తీసి బెంగళూరు టీంను 200 పై చిలుకు పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు.ఇక ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్స్ మొదటి నుంచి ఎదురుదాడికి దిగడమే కాకుండా తొందరగా టార్గెట్ ను చేదించాలనే లక్ష్యం తో వాళ్ళు ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది.
ఇశాన్ కిషన్, ( Ishan Kishan ) సూర్యకుమార్ యాదవ్( Surya Kumar Yadav ) ఇద్దరు అద్భుతమైన హాఫ్ సెంచరీలు చేయడంతో 15 ఓవర్ల లోనే ముంబై తమ లక్ష్యాన్ని చేదించింది.దాంతో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

ఇక మొదట్లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ టీం వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకోవడంతో ఆ టీం అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి బెంగళూరు టీమ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన బుమ్ర ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ఇక బెంగళూరు టీమ్ వరుసగా మరొక ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.ఇక ఇలా ఆడితే బెంగుళూర్ టీమ్ ప్లే హాఫ్ కి క్వాలిఫై అవ్వడం చాలా కష్టమైన విషయం అని చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే వాళ్ళు ఆరు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి మిగిలిన ఐదు మ్యాచ్ లో ఓడిపోవడం అనేది చాలా దారుణమైన విషయమనే చెప్పాలి…