టీ20 జ‌ట్టులో త‌న‌ను ప్ర‌క‌టించ‌గానే ఏడ్చేసిన ముంబై క్రికెట్ ప్లేయ‌ర్..

క్రికెట‌ఈ ప‌దం వింటే చాలు మ‌న దేశంలోని చిన్న వారి ద‌గ్గ‌రి నుంచి పెద్ద‌వారి దాకా అంద‌రూ ఊగిపోవాల్సిందే అన్న‌ట్టు ఉంటుంది దీని క్రేజ్‌.

ఇక‌పోతే ఇప్పుడు మ‌న దేశంలో దీని త‌ర్వాతే మిగ‌తా ఆట‌లు ఉంటున్నాయి.

అయితే క్రికెట‌ర్ల‌కు సంబంధించిన చిన్న విష‌యం అయినా స‌రే ఇట్టే వైర‌ల్ అవుతుంది.ఇక టీ20 ప్రపంచ కప్ త్వ‌ర‌లోనే జ‌రుగుతున్న సంద‌ర్భంగా బీసీసీఐ ఇందుకు మ‌న దేశం త‌ర‌ఫున ఆడేవారి పేర్ల‌ను ప్రకటించి సంచ‌ల‌నం రేపింది.

అయితే ఈ సారి జ‌ట్టు ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.ఇక ఇందులో టీమిండియా యువ క్రికెట్ హిట్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ఇషాన్‌ కిషన్ ను కూడా సెలెక్ట‌ర్లు పిక చేశారు.

ఇక కిష‌న్‌ను గ‌బ్బ‌ర్ క్రికెట‌ర్ అయిన శిఖర్‌ ధావన్ అలాగే పృథ్వీ షాలకు బ‌దులుగా వారి మూడో స్థానంలో ఈ హిట్ట‌ర్‌ను ఓపెనర్‌గా ఎంచుకున్నారు మ‌న బీసీసీఐ సెలెక్ట‌ర్లు.అయితే ఇప్పుడు ఇషాన్ కిష‌న్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఐపీఎల్‌ 2021లో ఆడేందుకు ఆయ‌న దుబాయ్ వెళ్లిన సంగ‌తి అంద‌రికీ విదిత‌మే.

Advertisement

కాగా ఆయ‌న దుబాయ్ లో ఉన్న‌ప్పుడే ఇలాంటి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.దీంతో అత‌ను చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు.

త‌న పేరును బీసీసీఐ ప్రకటించగానే ఈ యంగ్ క్రికెట‌ర్ తీవ్ర భావోద్వేగానికి గురై త‌న ముంబై టీంలోని స‌హ‌చ‌ర ప్లేయ‌ర్ అయిన హార్దిక్‌ పాండ్యాను గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని ఎమోష‌న‌ల్ అయ్యాడు.ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఏడ్చేశాడు.ఇక హార్దిక్‌కు హగ్‌ ఇచ్చిన త‌ర్వాత మిగ‌తా వారిని కూడా క‌లుస్తూ ఇలాగే ఎమోష‌న‌ల్ అయ్యాడు ఈ యంగ్ ప్లేయ‌ర్‌.

కాగా ఆయ‌న ఇలా ఎమోష‌న‌ల్‌కు గురైన వీడియోను ముంబై ఇండియన్స్ టీం ఫ్యాన్స్‌తో పంచుకోగా అంద‌రూ ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని బాగా ఆడాల‌ని విషెస్ తెలిపారు.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి
Advertisement

తాజా వార్తలు