తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు బిగ్ బాస్ ను సూపర్ హిట్ చేసిన విషయం తెలిసిందే.దాంతో ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ ని తీసుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
ఈ నెల చివరి వారంలో భారీ ఎత్తున ఓటీటీ ప్లాట్ ఫామ్ పై బిగ్ బాస్ ప్రారంభం కాబోతుంది.నాగార్జున హోస్టింగ్ చేయబోతున్న ఈ షో పలువురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కళ కళలాడబోతుంది అంటూ ఇప్పటికే మీడియా వర్గాలకు షో నిర్వాహకులు హింట్ ఇచ్చారు.
కచ్చితంగా మాజీ కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ సమయం లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అందులో ముమైత్ ఖాన్ పేరు కూడా ఉంది.ఇంతకు ముందు సీజన్లో ముమైత్ ఖాన్ ను ఏ రేంజ్ లో వివాదాస్పద కంటింట్ ఇచ్చి హడావుడి చేసిందో తెలిసిందే.
కనుక ఆమె ఉంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంటుంది అని ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముమైత్ ఖాన్ ను బిగ్ బాస్ ఓటీటీలో ఉండబోతున్నారా అంటూ ప్రశ్నించగా ఆమె మౌనం వహించారు.

ఆ మౌనం కు అర్థం ఖచ్చితంగా ఆమె బిగ్ బాస్ లో ఉండబోతుంది అనేది సమాధానం అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ కు వెళ్లబోతున్న వారు తాము బిగ్ బాస్ కు వెళ్లబోతున్నట్లుగా ప్రకటించకూడదు.ఎక్కడ కూడా ఆవిషయాన్ని రివీల్ చేయకూడదు.కనుక ఆమె మాట్లాడలేదు.ఒకవేళ ఆమె వెళ్లకుంటే తాను వెళ్లడం లేదు అంటూ క్లారిటీ గా చెప్పేసిది కదా అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.