కుబేరుడిగా మార్చిన లాటరీ టికెట్: వారం క్రితం అనుమానాస్పద మృతి

ఇథియోపియా లక్కీమెన్ మైఖేల్ గెబ్రూ అనుమానాస్పద మృతి వెనుక గల కారణాలను నిగ్గు తేల్చాల్సిందిగా అతని కుటుంబసభ్యులు కెనడా ప్రభుత్వాన్ని కోరారు.

శనివారం అతని కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇథియోపియా జాతీయులు ఒక చర్చలో సమావేశమై గెబ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు.

సాధారణ ప్లాంట్ ఉద్యోగి నుంచి మిలియనీర్‌గా ఎదిగాడని.ధనవంతుడిగా మారానన్న గర్వం లేకుండా ఎంతోమందికి సాయం చేశాడని అతని సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు.

  ఇథియోపియాకు చెందిన మైఖేల్ తన కుటుంబసభ్యులతో కలిసి కెనడాలోని టోరంటో‌లో స్థిరపడ్డాడు.2017లో అసెంబ్లీ ప్లాంట్ ఉద్యోగం నుంచి తొలగించబడిన అతనికి గతంలో కొన్న లాటరీ టికెట్‌పై 10.7 మిలియన్ డాలర్ల ఫ్రైజ్‌మనీ తగిలింది.దీంతో ఆ రోజు నుంచి గెబ్రూ జీవితమే మారిపోయింది.

ఆ డబ్బుతో కుటుంబసభ్యులకు విలాసవంతమైన జీవితాన్ని అందించడంతో పాటు టోరెంటో, ఇథియోపియా, సోమాలియాలలోని ఎన్నో చర్చిలకు మైఖేల్ విరాళాలు ఇచ్చాడు.

Advertisement

 

  ఈ నేపథ్యంలో అతను గత సోమవారం స్వదేశంలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.ఆయన మరణానికి దారితీసిన కారణాలను అన్వేషించాల్సిందిగా మైఖేల్ గెబ్రూ కుటుంబసభ్యులు ఇథియోపియాలోని కెనడా ఎంబసీకి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన కెనడా ఎంబసీ అధికారులు.

తాము స్థానిక పోలీసులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ఒకవేళ గెబ్రూ మృతి వెనుక కుట్రకోణం వుంటే దోషులను వదిలిపెట్టమన్నారు.గెబ్రూ అంత్యక్రియలు సోమవారం ఆయన స్వదేశం ఇథియోపియాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల అశృనయనాల మధ్య జరిగాయి.

అమ్మో, గడ్డకట్టిన సరస్సుపై కుక్క.. ప్రాణాలకు తెగించి రక్షించిన భారతీయుడు..
Advertisement

తాజా వార్తలు