స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు మరోసారి ములాఖత్ కానున్నారు.ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి వెళ్లనున్నారు.
వీరితో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబును కలవనున్నారు.సాయంత్రం 4.30 గంటలకు వీరు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారని తెలుస్తోంది.మరోవైపు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబు త్వరగా బయటకు రావాలని దేవుడిని ప్రార్థించారని తెలుస్తోంది.







