కాకినాడ( Kakinada ) నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి.ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం( Pithapuram ) నుంచి అయినా పోటీ చేయండి.
తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి.చేగువేరా మీకు ఆదర్శం అంటారు గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్తారు.
ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని భావిస్తున్నాను.మీరు మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం.
మీ బెదిరింపులకు భయపడి నేను లొంగుబాటుకు రాను.గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు.దమ్ముంటే మీరు నన్ను నేరుగా తిట్టండి.నేను మీ బానిసను కాదు మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదు.
మీరు సినిమాల్లో హీరో రాజకీయాల్లో హీరో కాదని గ్రహించండి.నేను మీ వద్ద నౌకరి చేయడం లేదు.మీకు తొత్తుగా ఉండాలా గతం లో ఉద్యమంలో అరెస్ట్ అయిన వారిని ఎవరిని అయినా పరామర్శించారా.2016 నుంచి పెట్టిన కేసులు జగన్(YS Jagan Mohan Reddy ) తీసివేసిన సంగతి తెలుసా
.