ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.తెలంగాణాలో రాజకీయంగా దెబ్బ తిన్న టీడీపీ ఏపీలోనూ అదే పరిస్థితికి రాబోతోంది అనే అంచనాకు అంతా వచ్చేసారు.
అందుకే ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా అంతా చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు.అందుకే మొన్నటివరకు… ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అంత సీన్ లేదు అన్నవారంతా… ఇప్పుడు ఆ పార్టీకి చేరువ అవుతున్నారు.
ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ విషయంలో అదే చేస్తున్నాడు.తెలంగాణాలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడం పై ముద్రగడ హర్షం వ్యక్తం చేసాడు.
అసలు ముద్రగడ అడుగులు జనసేన వైపు పడుతున్నాయి అంతా అనుకుంటున్న సమయంలో … ఆయన చూపు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పడినట్టుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కొద్ది రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం వైసీపీకి చెందిన కొంతమంది కీలక నాయకులతో మంతనాలు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఎలాగూ ఏపీలో టీడీపీ వచ్చే ఛాన్స్ లేకపోవడం….జనసేన పార్టీకి కూడా మూడు నాలుగు జిల్లాల్లో తప్ప మిగతా చోట్ల అంత ప్రభావం చూపించే అవకాశం లేనట్టుగా పరిస్థితులు కనిపిస్తుండడంతో… జనసేన పార్టీ వైపు పడతాయన్న అడుగులు ఇప్పుడు వైసీపీ వైపు పడుతున్నాయి.తాజగా … జగన్ని కలిసేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నాడని… అందుకే… విజయసాయితో మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ఒక్కరికీ మెజార్టీ రాదని, అందుకే రాష్ట్రం నుంచి 25ఎంపిలను గెల్చుకుని ప్రత్యేక హోదాతో సహా కేంద్ర వ్యవసాయ, రైల్వేశాఖ మంత్రులు ఎపి నుంచి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు జగన్.

జగన్ వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలను సమర్థిస్తున్న ముద్రగడ ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని నాంచివేత ధోరణి అవలంబించకుండా… వీలైనంత తొందరగా… వైసీపీలో చేరడమే కాకుండా… ఆ పార్టీ నుంచి ఎంపిగా పోటీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టి రిజర్వేషన్ అంశం మీద అక్కడ కూడా తన వాయిస్ వినిపించాలని ప్లాన్ లో ఉన్నాడట.వైసీపీలో కనుక ముద్రగడ చేరితే ఆ ప్రభావం తీవ్రంగా ఉండడమే కాకుండా… టీడీపీ కంచుకోటలాంటి గోదావరి జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమే అవుతుంది.అంతే కాదు… ఆ ప్రభావం జనసేన మీద కూడా పడుతుంది అనడంలో సందేహమే లేదు.అయితే విజయసాయి తో ముద్రగడ ఏం మంతనాలు చేసాడు…? ఆయనకు వైసీపీ నుంచి వచ్చిన హామీ ఏంటి అనే విషయం పై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.







